E-Paper
Advertisement

Mad For Each Other: కపుల్ షో.. మరీ ఇంతగా దిగజారిపోతున్నారేంటిరా?

Mad For Each Other: కపుల్ షో.. మరీ ఇంతగా దిగజారిపోతున్నారేంటిరా?
Advertisement

Mad For Each Other: బిగ్ బాస్ షో (Bigg Boss Show) గురించి, అందులోకి వెళ్లే కంటెస్టెంట్స్ గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే, ఈ షో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని వుడ్‌లను విస్తరించింది. ఏడాదిలో ఒక 100 రోజల పాటు బిగ్ బాస్ హడావుడి ఉంటుంది. హౌస్‌లోకి సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా ఎంట్రీ ఇచ్చి ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఫైనల్‌గా ఒకరు విన్నర్ అవుతారు. ఈ 100 రోజులు హౌస్‌లో ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏమేం తప్పులు, ఒప్పులు చేశారు చెప్పేందుకు వీకెండ్ రెండు రోజులు హోస్ట్ వచ్చి క్లాస్‌లు ఇస్తుంటారు. ఈ షో ఫార్మెట్ అంతా జనాలకి తెలుసు. ఇప్పుడీ షోని మించేలా జియో హాట్‌‌స్టార్ ఓ రియాలిటీ షోను ప్లాన్ చేసింది. బిగ్ బాస్ ‌షోపైనే చాలా మంది ఫైర్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇప్పుడో జియో హాట్‌స్టార్ (JioHotstar) అనౌన్స్ చేసిన షో గురించి తెలిస్తే.. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారేమో.. సరే విషయంలోకి వెళితే..

Also Read- Varun Tej: చెల్లెలి ఫోన్ కట్.. లావణ్య ఫోన్ మాత్రం లిఫ్ట్.. అడ్డంగా బుక్ అయిపోయిన వరుణ్ తేజ్..!

షో కాన్సెప్ట్ ఇదే..

Advertisement

నేటి కాలంలో ప్రేమించడం సులభం, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం పెద్ద టాస్క్. మరి, కెమెరాల నిఘాలో, తీవ్రమైన ఒత్తిడి మధ్య ఒక బంధం ఎంతవరకు నిలబడుతుంది? ఇదే పాయింట్‌తో జియోహాట్‌స్టార్ తన లేటెస్ట్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ (Mad For Each Other)ను అనౌన్స్ చేసింది. ‘ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ షో, బుల్లితెరపై సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షో కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఒకే ఇంట్లో ఉండటం అంటే మాటలు కాదు, అది కూడా 70 రోజుల పాటు! ఈ షోలో 10 మంది సెలబ్రిటీ జంటలు ఒకే విల్లాలో కలిసి ఉండబోతున్నారు. ఈ 70 రోజులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, కేవలం తమ పార్ట్‌నర్, తోటి కంటెస్టెంట్లతో గడపాలి. కేవలం గెలవడం మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, సహనం, ప్రేమను ఈ షో పరీక్షిస్తుంది. ఇంకా, మోడరన్ డే రిలేషన్‌షిప్స్‌లో ఉండే కాంప్లికేషన్స్‌ను ఈ షో చాలా బోల్డ్‌గా చూపించబోతోంది.

Also Read- Hero Suhas: ‘హే భగవాన్’ టైటిల్ మార్చడానికి కారణం ఏంటంటే?

బిగ్ బాస్‌తో రేటింగ్స్ బాగానే వస్తున్నాయిగా..

Advertisement

‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షో అనౌన్స్‌మెంట్ తర్వాత నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ షోకి బాగానే రేటింగ్స్ వస్తున్నాయిగా? మళ్లీ ఇప్పుడీ షో అవసరమా? అందులోనూ కపుల్ అంటున్నారు. అంటే, చూడకూడని సన్నివేశాలు, బూతు కంటెంట్‌కు లెక్కే ఉండదనేలా కూడా జియోహాట్‌స్టార్ బోల్డ్‌గా అంటూ హింట్ ఇచ్చేస్తుంది. ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్స్‌, షో‌లతో సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దమని అనుకుంటున్నారు. ముందు నార్మల్‌గానే షోని లాంచ్ చేస్తారు.. ఆ తర్వాతే ఉంటది అసలు వ్యవహారం. అందులోనూ ఈ షోలోకి కొత్తగా పెళ్లయిన జంట కూడా ఉంటుందనేలా టాక్ నడుస్తుంది. 70 రోజుల పాటు భార్యలను పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉంటారా? ఏ కెమెరా అయినా వారి భాగోతాన్ని క్యాప్చర్ చేస్తే.. మళ్లీ గొడవలు, కోర్టు కేసులు. అసలు దేని కోసం ఈ రియాలిటీ షో. బిగ్ బాస్ వరకు ఓకే గానీ, ఇది చాలా డేంజర్ అనేలా నెటిజన్లు కొందరు ఫైర్ అవుతున్నారు.

Also Read- Venkatesh Multi Starrer: వెంకటేష్ సినిమాలో తమిళ స్టార్ హీరో.‌. ఎవరంటే..!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×