E-Paper
Advertisement

OTT Movie: 15 ఏళ్లకే ప్రెగ్నెన్సీ… అమ్మానాన్న ఆటలో స్కూల్ పిల్లలు… చిన్నపిల్లలు చూడకూడని సినిమా

OTT Movie: 15 ఏళ్లకే ప్రెగ్నెన్సీ… అమ్మానాన్న ఆటలో స్కూల్ పిల్లలు… చిన్నపిల్లలు చూడకూడని సినిమా
Advertisement

OTT Movie : సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎన్నో వస్తున్నాయి. ఇక షార్ట్ ఫిల్మ్స్ అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మించి ప్రశంసలు పొందిన ఒక తమిళ షార్ట్ ఫిల్మ్ మంచి మెసేజ్ ఇచ్చింది. ఇది టీనేజ్ ప్రగ్నెన్సీ వంటి సున్నితమైన అంశాన్ని వాస్తవికంగా చర్చించింది. ఒక సమస్య వచ్చినప్పుడు సమాజం కంటే తల్లిదండ్రుల మద్దతు, ముఖ్యంగా తల్లి ఇచ్చే ధైర్యం ఎంత అవసరమో ఈ మూవీని చూస్తే తెలుస్తుంది. ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందని కళ్ళకు కట్టినట్లు ఈ షార్ట్ ఫిల్మ్ చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

2018లో విడుదలైన ఈ తమిళ షార్ట్ ఫిల్మ్ పేరు “మా”. దీనికి సర్జున్ కె.ఎం దర్శకత్వం వహించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మించారు. ఈ స్క్రిప్ట్‌ను సర్జున్, ప్రియాంక రవీంద్రన్ రాశారు. ఇందులో అనిఖా సురేంద్రన్, కని కుస్రుతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం సుందరమూర్తి కె.ఎస్., సినిమాటోగ్రఫీని సుదర్శన్ శ్రీనివాసన్ నిర్వహించారు. ఇది 2018 జనవరి 25న తమిళ్ లో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను మేకర్స్ 2018 ఫిబ్రవరి 23న యూట్యూబ్ లో విడుదల చేశారు.

Advertisement

Read Also :దెయ్యాల కొంపలోకి తింగరి బ్రదర్స్… కామెడీతో కడుపుబ్బా నవ్వించే హారర్ సినిమా

స్టోరీ ఏమిటంటే

15 ఏళ్ల స్కూల్ విద్యార్థిని అమ్ము చుట్టూ తిరుగుతుంది. ఆమె స్కూల్ లో ఒక అబ్బాయితో సన్నిహితంగా మెలుగుతుంది. ఒకరోజు అనుకోకుండా ఇద్దరూ దగ్గర అవుతారు. దీంతో తనకి తెలీకుండానే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేక తీవ్రమైన మానసిక వేదనకు లోనవుతుంది. ఈ సున్నితమైన సమస్యను ఆమె తల్లి సత్య గుర్తిస్తుంది. తల్లి మొదట కూతురిపై కోపాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే కుమార్తె పడుతున్న ఆవేదనను, భయాన్ని చూసి ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. తన భర్త ఈ విషయం గురించి తెలుసుకుంటే జరిగే పరిణామాలకు తల్లి భయపడుతుంది. కుటుంబం ఎదుర్కొనే కళంకాన్ని నివారించడానికి, తల్లి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. కుమార్తెకు సహాయం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ఏమిటి ? కూతురి కోసం తల్లి ఏం చేస్తుంది ? ఈ సమస్య నుంచి వీళ్ళు ఎలా బయట పడతారు అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×