E-Paper
Advertisement

చావు అంటే భయపడే ప్రియుడికి విషమిచ్చి… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

చావు అంటే భయపడే ప్రియుడికి విషమిచ్చి… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ
Advertisement

Malayalam Romantic Mystery: అందమైన ప్రేమ కథ… అంతలోనే అంతు చిక్కని మర్డర్ మిస్టరీగా మారితే… ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే ప్రియుడికి విషమిచ్చి చంపితే… ఇలాంటి ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మర్డర్ మిస్టరీగా రూపొందిన మలయాళం మూవీనే ‘లూకా’ (Luca). ఇదే పేరుతో ఒక హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ కూడా వచ్చింది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అన్న వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

కథ నాన్ లీనియర్ నరేటివ్ స్టైల్ లో సాగుతుంది. ఒకవైపు లూకా-నిహారికల మధ్య సాగిన అందమైన ప్రేమ కథ, మరోవైపు ఆ ప్రేమ కథ వెనుక దాగి ఉన్న సీక్రెట్స్ ను వెలికితీసే పోలీసు అధికారి అక్బర్ కథ. ఈ రెండు థ్రెడ్స్ చివరికి ఎలా కలుస్తాయి అన్నదే ఈ సినిమా కథలో ప్రధాన ఆకర్షణ. కథ మొదట్లోనే ఒక మర్డర్ మిస్టరీగా మొదలవుతుంది. కొచ్చిన్‌లోని ఒక చిన్న గదిలో లూకా శవంగా కనిపిస్తాడు. అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తారు. కానీ కేసును ఇన్వెస్టిగేట్ చేసే అక్బర్ కు ఏదో తప్పు ఉన్నట్లు అనిపిస్తుంది.

Advertisement

అందుకే లూకా గదిని సోదా చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఒక పాత డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో ఒక్కొక్క పేజీ తెరుచుకోవడంతో అతని ప్రేమ కథ షురూ అవుతుంది. లూకా టాలెంటెడ్ స్క్రాప్ ఆర్టిస్ట్. పాత, పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాఖండాలు సృష్టించే వ్యక్తి. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన అతనికి శవాలు, చావు అంటే ఒక రకమైన ఫోబియా ఉంటుంది. అందుకే ఎప్పుడూ కోపంగా, సింగిల్ గా ఉంటూ కనిపిస్తాడు.

అలాంటి సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన రీసెర్చ్ స్టూడెంట్ నిహారిక అతని ఇంటికి పేయింగ్ గెస్ట్‌గా వస్తుంది. నిహారిక కూడా తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల వల్ల మానసిక గాయాలతో బాధపడుతుంది. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. లూకా ఆమెను అర్థం చేసుకుంటాడు, ఆమె కూడా అతన్ని హీల్ చేస్తుంది. లూకా ఆర్ట్ ద్వారా తన భావాలను వ్యక్తం చేయడం, నిహారిక అతని పక్కన నిలబడటం వంటి సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి.

Advertisement

కానీ ఈ అందమైన ప్రేమకథ ఇక్కడే విషాదకరమైన మలుపు తిరుగుతుంది. లూకాకు టెర్మినల్ క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. చావు అంటే భయపడే అతను ఆ నరకయాతనను భరించలేకపోతాడు. నిహారిక తన ప్రియుడినికి ఆ బాధ నుంచి విముక్తి కల్పించాలనే ఆలోచనతో షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ షాకింగ్ నిర్ణయం ఏంటి ? అతని కోసం హీరోయిన్ చేసిన హృదయాన్ని కదిలించే త్యాగం ఏంటి ? ఈ డైరీ వల్ల ఆ పోలీస్ ఆఫీసర్ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి ?? అన్నది తెలియాలంటే ఈ మూవీని మస్ట్ వాచ్.

తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళ చిత్రం ‘లూకా’ 2019లో వచ్చింది. టోవినో థామస్, అహానా కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది మూవీ లవర్స్ ఫేవరెట్‌ సినిమాల లిస్ట్ లో ఉంటుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ aha OTT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. మలయాళ వెర్షన్ ManoramaMAXలో చూడవచ్చు. క్లైమాక్స్ మాత్రం గుండె పగిలేలా ఉంటుంది.

Read Also: మర్మమైన రీతిలో గ్రామస్తుల మరణాలు… దున్నపోతును బలిస్తేనే శాంతించే శాపం

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×