E-Paper
Advertisement

అమ్మాయి కోసం ఇదేం అరాచకం… ప్రదీప్ రంగనాథన్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్

అమ్మాయి కోసం ఇదేం అరాచకం… ప్రదీప్ రంగనాథన్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్
Advertisement

Romantic Movie OTT : ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా మేకర్స్ కొత్త కొత్త ప్రేమ కథలను తీసుకువస్తున్నారు. అలాంటి సినిమాల లిస్ట్ లో రీసెంట్ గా వచ్చిన ప్రదీప్ రంగనాథన్ మూవీ కూడా ఒకటి. ఇప్పటికే థియేటర్లలో ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరికొన్ని గంటల్లో ఈ మూవీని ఇంట్లోనే కూర్చుని ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Vignesh Shivan దర్శకత్వం వహించిన సరికొత్త లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany – LIK). ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కేవలం రొమాంటిక్ మూవీనే కాదు ఒక వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఎస్.జె. సూర్య ఇందులో ఒక విలక్షణమైన పాత్రలో కన్పిస్తారు. ఆయన తన నటనతో నవ్వులు పూయిస్తూనే ఆకట్టుకుంటారు. ప్రదీప్ రంగనాథన్ తన మార్క్ కామెడీ, ఎనర్జీతో మెప్పిస్తారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి సినిమాలో గ్లామరస్‌ గా, ఎమోషనల్‌ గా కనిపిస్తారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. విఘ్నేష్ శివన్ తనదైన శైలిలో ‘ప్రేమ’ అనే పాత కాన్సెప్ట్‌కు ‘టెక్నాలజీ’ని జోడించి ఒక కలర్ ఫుల్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. భవిష్యత్తులో మన ప్రేమలు ఎలా ఉండబోతున్నాయి అనే పాయింట్‌ తో రూపొందిన ఈ ‘ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ’ యంగ్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ మూవీ స్టోరీ ఫ్యూచర్ లో అంటే 2035వ సంవత్సరంలో సాగుతుంది. టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఆ కాలంలో, మనుషుల మధ్య ప్రేమలు – బంధాలు అనేవి సరిగ్గా ఉండవు. ఈ నేపథ్యంలోనే వింతగా ఒక కంపెనీ ‘లవ్ ఇన్సూరెన్స్’ను ఆఫర్ చేస్తుంది. అంటే ఎవరైనా ప్రేమలో ఫెయిల్ అయినా, బ్రేక్ అప్ జరిగినా వారికి ఆ కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది. లేదంటే వారి ప్రేమను సక్సెస్ చేయడానికి సహాయం చేస్తుంది.

Also Read : కొడుకు చావుకి రివేంజ్… మనుషులు ఇంత బ్రూటల్ గా కూడా ఉంటారా భయ్యా

Advertisement

ఈ నేపథ్యంలోనే హీరో ప్రదీప్ తన ప్రేయసి (కృతి శెట్టి)ని దక్కించుకోవడానికి ఈ కంపెనీ సాయం కోరుతాడు. ఇక్కడే కథలో అసలు రచ్చ మొదలవుతుంది.సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… ఒక వింత గ్యాడ్జెట్ ద్వారా హీరో తన భవిష్యత్తులోకి వెళతాడు. అలా వెళ్ళి తన ప్రేమ కథలు ఎలాంటి ఎండ్ కార్డు ఉందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను 2024 అంటే గతం, 2035 భవిష్యత్తు మధ్య చేసే ప్రయాణంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ జర్నీలో ఎదురయ్యే ఫన్నీ, ఎమోషనల్ సీన్స్ ఏంటి అన్నది తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×