E-Paper
Advertisement

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ
Advertisement

OTT Movie : ‘డేటింగ్ యాప్’ ఈ పేరు వింటే కుర్రకారుకి గిలిగింతలు వస్తాయి. ఎక్కడలేని ఉత్సాహంతో కొండ మీద కోతిని కూడా తెచ్చేస్తాం అనే ఫీలింగ్ లో ఉంటారు. దీని వెనుక జరిగే దారుణాలు తెలిస్తే దాని జోలికి కూడా వెళ్ళరు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫ్రెండ్ షిప్ పేరుతో ఈ డేటింగ్ యాప్ లు గలీజ్ పనులకు అడ్డాగా మారాయి. దీని వల్లమోసపోయిన వాళ్ళ గురించి ఒక డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సిరీస్ లో బాధితులు డేటింగ్ యాప్ తో ఎలా మోసపోతున్నారో ఒక లేడీ డిటెక్టివ్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి రాబోతోంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌లో

Advertisement

‘లవ్ కాన్ రివెంజ్’ (Love Con Revenge) 2025లో విడుదలైన డాక్యుమెంటరీ సిరీస్. ఇది రియాలిటీ థ్రిల్లర్ శైలిలో రూపొందింది. ఇది జేమ్స్ ఓ’రైలీ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సిసిలీ ఫ్జెల్‌హోయ్ (ది టిండర్ స్విండ్లర్ డేటింగ్ యాప్ బాధితురాలు) ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ బ్రియాన్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. 2025 సెప్టెంబర్ 5 నెట్‌ఫ్లిక్స్‌లో ఆరు ఎపిసోడ్‌లతో విడుదలైన ఈ డాక్యుమెంటరీ IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సెసిలీ ఒక డేటింగ్ యాప్ లో సైమన్ అనే మోసగాడి చేతిలో దారుణంగా మోసపోతుంది. ఆమె ఈ సిరీస్‌లో రొమాన్స్ స్కామ్‌లను బయటపెట్టే లక్ష్యంతో బ్రియాన్ జోసెఫ్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ సిరీస్ డేటింగ్ యాప్‌ల ద్వారా ప్రేమ పేరుతో వంచించి బాధితుల నుండి డబ్బు దొంగిలించే మోసగాళ్లను లక్ష్యంగా చేసుకుంటుంది. సెసిలీ తన సొంత అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలతో, ప్రపంచవ్యాప్తంగా రొమాన్స్ స్కామ్‌లకు గురైన వ్యక్తులను కలుస్తుంది. ఈ సిరీస్ మోసపోయిన వాళ్ళ కథలను చూపిస్తూ, వాళ్ళ ఆర్థిక భావోద్వేగ నష్టాలను హైలైట్ చేస్తుంది. అలాగే సెసిలీ బ్రియాన్ ఈ మోసాల వెనుక ఉన్న నేరస్థులను ఎలా ట్రాక్ చేస్తారో చూపిస్తుంది.

ఈ డాక్యుమెంటరీ సిరీస్ రొమాన్స్ స్కామ్‌ల మోసాలను, ముఖ్యంగా డేటింగ్ యాప్‌ల వాడకం పెరిగిన నేపథ్యంలో, వాటి భయంకరమైన పరిణామాలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది. సెసిలీ, బ్రియాన్ మోసగాళ్ల నుంచి బాధితుల కోసం పోరాడుతూ వారికి సహాయపడతారు. ఈ క్రమంలో వీళ్ళు చాలా మంది నేరస్థులను ఎదుర్కొంటారు. ఇది ఒక ఉత్కంఠభరితమైన ప్రయాణంగా మారుతుంది. మరి ఈ మోసాలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటే, ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని తప్పకుండా చూడండి.

Read Also : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన స్థితిలో… లగ్జరీ కారు దొరికిందనుకుంటే డేంజరస్ డెడ్లీ గేమ్ లోకి… గ్రిప్పింగ్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×