E-Paper
Advertisement

OTT Movie: జైలు నుంచే రాబరీ స్కెచ్… ఒక్క సారి చేస్తే లైఫ్ సెట్టు… దిమాక్ కరాబయ్యే క్లైమాక్స్

OTT Movie: జైలు నుంచే రాబరీ స్కెచ్… ఒక్క సారి చేస్తే లైఫ్ సెట్టు… దిమాక్ కరాబయ్యే క్లైమాక్స్
Advertisement

OTT Movieహాలీవుడ్ నుంచి వచ్చిన ఒక హీస్ట్ స్టోరీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ సినిమాలో జేమ్స్ బాండ్ హీరో డానియల్ క్రెయిగ్‌ నటించడం విశేషం. అదే స్థాయిలో ఈ సినిమా కూడా ఉంటుంది. ఒక పెద్ద దొంగతనం చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ప్రతి సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడా వైలెన్స్ లేకుండా, క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్ గా ఉంటుంది. చివరికి రాబరీ సక్సెస్ అయిందా ? లేదా అనేదే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ హీస్ట్ కామెడీ మూవీ పేరు ‘Logan Lucky’. డానియల్ క్రెయిగ్‌కు ఇది జేమ్స్ బాండ్ తర్వాత బెస్ట్ ఫన్నీయెస్ట్ రోల్. ఐయండిబిలో దీనిని 7.0/10 రేటింగ్ ఉంది. ఇందులో చానింగ్ టాటమ్, డానియల్ క్రెయిగ్, హిల్లరీ స్వాంక్, సెబాస్టియన్ స్టాన్ లీడ్ రోల్స్ లో నటించారు. 2017 లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

జిమ్మీ లోగన్ అమెరికాలోని వెస్ట్ వర్జీనియా అనే గ్రామీణ ప్రాంతంలో ఉంటాడు. గనుల్లో పని చేస్తూ ఉండగా కాలు గాయపడి ఉద్యోగం పోతుంది. భార్య విడు విడాకులు ఇచ్చేసింది. చిన్న కూతురు సాడీని కలవడానికి కూడా డబ్బు లేదు. అందుకే ఈ సమయంలో అతనికి ఒక గజిబిజి ఐడియా వస్తుంది. అమెరికాలోనే అతి పెద్ద కార్ రేస్ ప్రాంతంలో ఉండే లక్షల డాలర్ల మనీని దోచేయాలని అనుకుంటాడు. అతని తమ్ముడు క్లైడ్, హెయిర్ స్టైలిస్ట్ చెల్లెలు మెల్లీ టీమ్‌గా చేరతారు. కానీ ఈ దొంగతనానికి అసలు మాస్టర్‌మైండ్ జో అనే వ్యక్తి జైల్లో ఉంటాడు. అతను బాంబు పేల్చడంలో స్పెషలిస్ట్. జోని జైలు నుంచి బయటకు తెచ్చేందుకు వాళ్లు జైల్లోనే అల్లరి సృష్టించి, అతన్ని హాస్పిటల్‌కి తరలించేలా చేస్తారు. అక్కడి నుంచి జో బయటకు వచ్చి దొంగతనం చేసి… మళ్లీ జైలుకే తిరిగి వెళ్లిపోతాడు.

Read Also : జాంబీలుగా మారే సైంటిస్ట్ ఫ్యామిలీ… ఊరు ఊరంతా వల్లకాడు … ఇదెక్కడి అరాచకం భయ్యా

Advertisement

రేస్ రోజు అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. మెల్లీ హ్యాక్ చేసిన పైప్ సిస్టమ్ ద్వారా డబ్బు బస్తాలు గార్బేజ్ లోకి పంపిస్తారు. జో బాంబులు పేల్చి లాకర్ తెరుస్తాడు. రేస్ ముందుగానే ముగిసిపోవడంతో టైమ్ తక్కువ అయినా వాళ్లు దాదాపు 1.2 కోట్ల డాలర్లు (సుమారు 100 కోట్ల రూపాయలు) దోచుకుంటారు. ఇప్పడు FBI ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో వీళ్ళ బండారం బయట పడుతుందా ? దొంగలించిన డబ్బు ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×