E-Paper
Advertisement

OTT Movie : ప్రేమ ప్రేమా అంటూ అందరూ కరువులోనే… ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో … ఇది లవ్ బర్డ్స్‌కి ఎక్స్ట్రా స్టఫ్

OTT Movie : ప్రేమ ప్రేమా అంటూ అందరూ కరువులోనే… ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో … ఇది లవ్ బర్డ్స్‌కి ఎక్స్ట్రా స్టఫ్
Advertisement

OTT Movie : మలయాళం సినిమాలు కొత్త కొత్త స్టోరీలతో, కేక పెట్టిస్తున్నాయి.  ఈ మధ్య మలయాళం సినిమాలకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా మూడు లవ్ స్టోరీలతో తిరుగుతుంది. ప్రతీ లవ్ స్టోరీ ఒక విభిన్న శైలిలో ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

సిబి, శోషా అనే చిన్ననాటి స్నేహితులు, ఒక కాఫీ తటలో పని చేసుకుంటూ ఉంటారు. వీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకుంటాయా అనే భయంతో ఉంటారు.  అందుకే తమ ప్రేమను ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ జంట ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలి అనే ఆలోచనలో ఉంటారు. మరొవైపు బేబీ, సిసిలీ ప్రేమ కథ మొదలౌతుంది. బేబీ అనే 56 ఏళ్ల వ్యక్తికి, భార్య చనిపోయి ఉంటుంది. తరువాత తన చిన్ననాటి ప్రేమికురాలు సిసిలీతో సంబంధం పెట్టుకుంటాడు. సిసిలీ భర్త ఆమెను, ఆమె కూతుర్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తరువాత వీళ్ళ సంబంధం సమాజంలో ఆటుపోట్లు ఎదుర్కుంటుంది. కుటుంబ సభ్యులు కూడా సిసిలీని హెచ్చరిస్తుంటారు.

ఇది ఇలా ఉండగా, మరో స్టోరీలో షారన్ (షైన్ టామ్ చాకో), యూకే నుండి వచ్చిన ఒక విదేశీయుడితో స్వలింగ సంబంధంలో ఉంటాడు. వీళ్ళు జీవితాంతం కలసి ఉండాలని అనుకుంటారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం అతనికి ఉండదు. ఈ బాధ్యతను సిబి తీసుకుంటాడు. షారన్  ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేస్తాడు. ఇలా ఈ మూడు లవ్ స్టోరీలకు శుభం కార్డ్ పడకుండా సాగుతూనే ఉంటుంది. చివరికి సిబి, శోషా ల పెళ్ళికి పెద్దలు ఒప్పుకుంటారా ? బేబీ, సిసిలీల సంబంధం ఏమౌతుంది ? షారన్ విదేశీయుడితో కలసి ఉండటానికి అడ్డంకులు తొలుగుతాయా ? అనే విషయాలం తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఐడియా ఇచ్చిన శవం… పరుగులు పెట్టించే డబ్బు… పొట్ట చెక్కలయ్యే కామెడీ

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘లిటిల్ హార్ట్స్’ (Little hearts). 2024 లో విడుదలైన ఈ మూవీకి అబి ట్రీసా పాల్, ఆంటో జోస్ పెరీరా దర్శకత్వం వహించారు. దీనిని రాజేష్ పిన్నాడన్ రచించగా, సాండ్రా థామస్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇందులో షేన్ నిగమ్, మహిమా నంబియార్, బాబురాజ్, షైన్ టామ్ చాకో, రమ్యా సువి, రెంజి పణిక్కర్, మాలా పార్వతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇడుక్కి జిల్లాలోని పుష్పకందం అనే చిన్న గ్రామంలో జరుగుతుంది. ఈ స్టోరీ మూడు విభిన్న ప్రేమ కథల చుట్టూ తిరుగుతుంది. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.  ‘లిటిల్ హార్ట్స్’ 2024 జూన్ 7న థియేట్రికల్‌గా విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×