E-Paper
Advertisement

OTT Movie : మనుషుల రక్తాన్ని తాగే ఏలియన్ వ్యాంపైర్స్… అదిరిపోయే సైఫై మూవీ

OTT Movie : మనుషుల రక్తాన్ని తాగే ఏలియన్ వ్యాంపైర్స్… అదిరిపోయే సైఫై మూవీ
Advertisement

OTT Movie : ఏలియన్స్ స్టోరీలతో చాలా సినిమాలే వచ్చాయి. వీటి గురించి భూమి మీద రకరకాల స్టోరీలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వీటి గురించి  అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి.  అయితే ఇప్పుడు ఏలియన్స్ స్టోరీలతో దిమ్మ తిరిగే సినిమాలు వస్తున్నాయి.  1985 లోనే అందరూ  ఆశ్చర్యపడే విధంగా ఒక ఏలియన్ మూవీని తెరకెక్కించారు. అయితే ఇందులో ఆ ఏలియన్స్ వాంపైర్ లా రక్తాన్ని పీల్చి మనుషుల్ని చంపుతుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘లైఫ్‌ఫోర్స్’ (Life Force). 1985 లో రిలీజ్ అయిన ఈ మూవీకి టోబ్ హూపర్ దర్శకత్వం వహించారు. ఇందులో స్టీవ్ రైల్స్‌బ్యాక్, పీటర్ ఫిర్త్, ఫ్రాంక్ ఫెన్లే, మథిల్డా మే నటించారు. 1976 లో కోలిన్ విల్సన్ రచించిన ‘ది స్పేస్ వాంపైర్స్’నవల ఆధారంగా ఈ మూవీని చిత్రీకరించారు. ఈ మూవీలో స్పేస్ నుంచి ముగ్గురు గ్రహాంతర వాసులను భూమి మీదకు తీసుకొస్తారు. తరువాత భూమి మీద పరిస్తితి చాలా క్రిటికల్ గా మారుతుంది. బాక్సాఫీస్ వద్ద ఇది ఈ మూవీ ఒక కల్ట్ ఫిల్మ్‌గా మారింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

అంతరిక్ష పరిశోధనల కోసం ఒక మిషన్‌ ను స్పేస్ లోకి పంపిస్తారు శాస్త్రవేత్తలు. స్పేస్ లోకి వెళ్ళినాక, అంతరిక్ష నౌకలోని సిబ్బంది ఒకచోట వింతైన భారీ నౌకను కనుగొంటారు. దాని లోపల మూడు మానవ రూపాల్లో ఉన్న జీవులను చూస్తారు. అంత పెద్ద షిప్ లో ఎవరూ ఉండరు. అయితే ఆ ఏలియన్స్ ప్రాణాలతో ఉంటాయి. కాకపోతే నిద్రాణస్థితిలో, ఒక గాజు పెట్టెలో భద్రపరచి ఉంటాయి. వీటితో పాటు వేలాది గబ్బిలం లాంటి జీవుల మృతదేహాలు కూడా అక్కడ పడి ఉంటాయి. అంతరిక్ష సిబ్బంది ఈ మూడు జీవులను భూమికి తీసుకువస్తారు. భూమిపైకి చేరిన తర్వాత, ఈ జీవులు శక్తివంతమైన స్పేస్ వాంపైర్లు అని తెలుస్తుంది. వారు మానవుల శక్తిని పీల్చుకుంటూ, వారిని ఎండిపోయిన శవాలుగా మార్చేస్తారు. ఈ క్రమంలో బాధితులు కూడా వాంపైర్లుగా మారి,  మిగతా వాళ్ళపై దాడి చేస్తుంటారు.

అందులో ఒక మహిళా వాంపైర్ అసాధారణ శక్తులతో, ఆకర్షణీయమైన రూపంతో కనిపిస్తుంది. ఆమె వివిధ రూపాలు ధరించి మనుషులను చంపుతూ ఉంటుంది. ఆమె చుట్టూ స్టోరీ ఎక్కువగా తిరుగుతుంది.ఈ వాంపైర్లు చంపే విధానం చూస్తే, భూమిని నాశనం చేయడానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. చివర్లో కార్ల్సెన్ అనే వ్యక్తి ఈ వాంపైర్లను ఆపడానికి ప్రయత్నిస్తాడు. మహిళా వాంపైర్‌ ను కార్ల్సెన్ ఒక లెడ్ లైన్డ్ కత్తితో చంపడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆ వాంపైర్లను మనుషులు అంతం చేస్తారా? వాటిని ఎవరు క్రియేట్ చేశారు? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×