E-Paper
Advertisement

Legal Drama OTT: కడుపు తెచ్చుకున్నందుకు కేసు… ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్ మావా

Legal Drama OTT: కడుపు తెచ్చుకున్నందుకు కేసు… ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్ మావా
Advertisement

Legal Drama OTT : కొన్ని సినిమాల్లో స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందులోనూ కోర్ట్ రూం డ్రామాలు చాలా ఆసక్తికరంగా సాగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ ఇదే కాన్సెప్ట్ తో ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది. అయితే ఇది రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ కథ చేయని నేరానికి ఎనిమిదేళ్లు శిక్ష పడే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఐయండిబిలో ఏడుకు పైగా రేటింగ్ కూడా పొందింది ఈ మూవీ.

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో స్ట్రీమింగ్

ఈ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ పేరు ‘బెలెన్’ (Belén). డోలోరెస్ ఫోన్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించారు. 2025 లో వచ్చినా ఈ సినిమా, 98వ ఆస్కార్ అవార్డులకు గాను  అర్జెంటీనా తరపున అధికారికంగా ఎంపికైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెలిన్ అనే ఒక పేద యువతికి అనుకోకుండా గర్భస్రావం జరుగుతుంది. ఆ బాధలో ఉన్న ఆమెకు వైద్యం అందాల్సింది పోయి, హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఆమె తన బిడ్డను కావాలనే చంపేసిందని నింద వేసి, చట్టం ఆమెను నేరస్తురాలిగా ముద్ర వేస్తుంది. ఏ తప్పు చేయకపోయినా సమాజం దృష్టిలో దోషిగా నిలబడి, అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సోలెదాద్ దేజా అనే ఒక న్యాయవాది బెలిన్ కేసును చేతుల్లోకి తీసుకుంటుంది. వ్యవస్థలో ఉన్న లోపాలను, ఆడవారి పట్ల ఉన్న వివక్షను ఎదిరిస్తూ ఆమె న్యాయపోరాటం మొదలుపెడుతుంది. ఈ పోరాటం కేవలం ఒక వ్యక్తికి న్యాయం అందించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమానికి దారితీస్తుంది. చివరికి అన్ని అడ్డంకులను అధిగమించి బెలిన్ ఎలా విడుదలయ్యిందనేదే ఈ సినిమా కథ.

రియల్ స్టోరీ

అర్జెంటీనా దేశంలో 2014లో జరిగిన ఒక సంచలన కేసు ఆధారంగా ఈ సినిమా తీశారు. ఆ అమ్మాయి అసలు పేరు బయటకు రాకూడదని ఆమెను ‘బెలిన్’ (Belén) అనే పేరుతో పిలిచారు. 25 ఏళ్ల బెలిన్ తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్తే, అది గర్భస్రావం అని తేలింది. కానీ అక్కడి డాక్టర్లు ఆమెకు తెలియకుండానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ విచారణ సరిగ్గా జరగకుండానే ఆమెకు ఏకంగా 8 ఏళ్ల జైలు శిక్ష వేశారు. దాదాపు రెండున్నర ఏళ్లు ఆమె జైల్లోనే గడిపింది. ఆమెకు జరిగిన అన్యాయం తెలుసుకున్న సోలెదాద్ దేజా అనే లాయర్ ఈ కేసును మళ్ళీ తిరగదోడింది. ఈ పోరాటం వల్ల అర్జెంటీనాలో లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. చివరికి 2017లో సుప్రీంకోర్టు ఆమె నిర్దోషి అని తీర్పునిచ్చి విడుదల చేసింది. ఈ కేసు అర్జెంటీనా దేశంలోని అబార్షన్ చట్టాలను మార్చడానికి ఒక ప్రధాన కారణమైంది.

Advertisement

Read Also : రాత్రిపూట మాత్రమే కనిపించే ఊరు… బర్త్ డే పార్టీలో చేరే దయ్యాలు… ఐఎండిబీలో 7.4 రేటింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×