E-Paper
Advertisement

ఆధారాలు లేని కేసులోనూ అద్భుతాలు చేసే మేధావి… కోర్టు గదిలో మైండ్ బ్లాక్ చేసే లాయర్

ఆధారాలు లేని కేసులోనూ అద్భుతాలు చేసే మేధావి… కోర్టు గదిలో మైండ్ బ్లాక్ చేసే లాయర్
Advertisement

Legal Drama OTT : లీగల్ డ్రామాలు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలలో అప్పుడప్పుడు అలరించే ఈ కంటెంట్, ఈ మధ్య వెబ్ సిరీస్ ల రూపంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. లీగల్ డ్రామాలు ఇష్టపడే వారికోసం ఒక అదిరిపోయే వెబ్ సిరీస్ గురించి చెప్పుకోవాలి. ఈ జపనీస్ డ్రామా కామెడీతో పాటు మంచి కంటెంట్ ను కూడా ఇస్తుంది. నిజానికి జపాన్‌లో క్రిమినల్ కేసుల్లో దోషులకు శిక్ష పడే అవకాశం 99.9% ఉంటుంది. అంటే ఒక్కసారి కేసు నమోదైతే శిక్ష పడటం దాదాపు ఖాయం. అయితే ఈ సిరీస్‌లో హీరో మిగిలిన ఆ 0.1% ని డీల్ చేస్తూ నిర్దోషులను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఈ సిరీస్ జపాన్ లో మంచి రేటింగ్ కూడా సొంతం చేసుకుంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ జపనీస్ లీగల్ డ్రామా సిరీస్ పేరు ‘99.9: క్రిమినల్ లాయర్’ (99.9: Criminal Lawyer). ఈ సిరీస్ మెయిన్ హీరో జున్ మాట్సుమోటో జపాన్‌లో ఎంత పెద్ద స్టార్ అంటే, మన దగ్గర మహేష్ బాబు, అల్లు అర్జున్ ఉన్నంత క్రేజ్ ఆయనకు ఉంటుంది. ఆయన ఒక పాప్ సింగర్ కూడా. అందుకే ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ చివరలో ఆయన బ్యాండ్ ‘అరాషి’ పాడిన పాటలు వస్తుంటాయి. అవి జపాన్‌లో అప్పట్లో పెద్ద హిట్. ఇక ఈ షోలో హీరో చేసే వంటలు, వాడే మసాలాలు ఎంత ఫేమస్ అయ్యాయంటే, జపాన్‌లోని సూపర్ మార్కెట్లలో ‘99.9’ బ్రాండ్‌తో ప్రత్యేకమైన సాస్‌లు, తినుబండారాలు కూడా అమ్మేవారు. ఆఖరికి ఇందులో హీరో వంట చేసే రెస్టారెంట్ సెట్ చూడటానికి కూడా జనం ఎగబడేవారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ డ్రామాలో చూపించే కోర్టు సీన్లు చాలా వరకు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. జపాన్ టీవీలో ఇది అత్యధిక రేటింగ్స్ సాధించిన సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. సీజన్ 1: 2016ఏప్రిల్ 17న హిట్ అవ్వడంతో, సీజన్ 2: 2018 జనవరి 14న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు సీజన్లు Viki, Netflix ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జపాన్ దేశంలో ఒక్కసారి పోలీస్ కేసు అయ్యిందంటే చాలు, నూటికి 99.9 శాతం మందికి జైలు శిక్ష పడి తీరాల్సిందే. అంటే అక్కడ కోర్టు మెట్లు ఎక్కిన ఎవరికైనా శిక్ష పడటం గ్యారెంటీ అన్నమాట. అయితే ఈ సిరీస్ లో హీరో మియామా మాత్రం, అందరూ వదిలేసిన ఆ మిగిలిన 0.1 శాతం కేసులను డీల్ చేస్తుంటాడు. ఏ తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదని అతను గట్టిగా అనుకుంటాడు. అతనికి కావాల్సింది పైసలు కాదు, కేవలం నిజం మాత్రమే. మియామా ఒక పెద్ద లా కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ అతని బాస్ సడా అని ఒకాయన ఉంటాడు. అతనికేమో పైసలు, పేరు ప్రఖ్యాతలు అంటే చాలా పిచ్చి. మొదట్లో వీళ్లిద్దరికీ అస్సలు పడదు. మియామా చేసే పనులు, అతని వింత అలవాట్లు (వంట చేస్తూ కేసు గురించి ఆలోచించడం, పనికిరాని జోకులు వేయడం) చూసి బాస్ కి పిచ్చెక్కుతుంది.

కానీ మియామా తెలివితేటలు చూశాక, వీడు మామూలోడు కాదురా నాయనా అని ఆ బాస్ కూడా ఇతనితో కలిసి కేసులు గెలవడం మొదలుపెడతాడు. పోలీసులు, లాయర్లు అంతా కలిసి ఒక వ్యక్తిని దోషి అని ఫిక్స్ అయిపోయినప్పుడు, మియామా తన టీంతో కలిసి సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. చిన్న చిన్న క్లూస్‌ని పట్టుకుని, అసలు నేరం జరిగిన చోటికి వెళ్లి మళ్ళీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చివరకు అందరూ నోరెళ్లబెట్టేలా కోర్టులో నిజాన్ని నిరూపిస్తాడు. మొత్తానికి ఇది ఒక తెలివైన లాయర్, పోలీసులకి ఎదురు తిరిగి సామాన్యులని ఎలా కాపాడనే ఒక అదిరిపోయే కోర్టు డ్రామా.

Advertisement

Read Also : ఇంటర్నేషనల్ లెవల్లో రచ్చ చేసిన ఆ యాడ్… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ మూవీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×