E-Paper
Advertisement

Latest Telugu OTT releases : ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు మూవీస్… శోభిత ధూళిపాళ్ళ మూవీ కూడా

Latest Telugu OTT releases : ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు మూవీస్… శోభిత ధూళిపాళ్ళ మూవీ కూడా
Advertisement

Latest Telugu OTT Releases : థియేటర్లలో అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు ఊహించని విధంగా విజయాలను అందుకున్నాయి. వీటిలో సాయికుమార్ వారసుడు ఆది సాయికుమార్ నటించిన ‘శంభాల’ మూవీ కూడా ఒకటి. అలాగే శ్రీకాంత్ వారసుడు రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ మూవీ కూడా ఉంది. ఇక ఈ సినిమాలు థియేటర్ రన్ ముగించుకొని ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వీటితోపాటు శోభిత ధూళిపాల నటించిన ‘చీకటిలో’ మూవీ కూడా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మరి ఆడియన్స్ ఈ వీకెండ్ ఓటీటీలో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలు ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.

‘శంభాల’

ఆది సాయికుమార్ నటించిన ఈ సినిమాను మొదట చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుండి పరిస్థితులు మారిపోయాయి. ఈ సినిమా ఆది కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 7న, ట్రైలర్‌ను నవంబర్ 1న నటుడు ప్రభాస్ విడుదల చేయగా, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు. ఇది 2026 జనవరి 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

‘చీకటిలో’

Advertisement

చాలా కాలం తర్వాత, శోభిత ధూళిపాల తెలుగు సినిమాలో నటించిన సినిమా ఇది. శోభిత ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్ర పోషించింది. చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్‌లతో పాటు ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ కూడా కీలక పాత్రల్లో నటించారు. చీకటిలో చిత్రానికి శరణ్ కోపిశెట్టి దర్శకత్వం వహించారు. ఇది 2026 జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ మేకా నటించిన ఈ పీరియాడికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ లో దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి. అశ్వనీదత్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌పై ప్రియాంక దత్, జి.కె. మోహన్, జెమిని కిరణ్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించాడు. రోషన్ మేక, అనస్వర రాజన్, నందమూరి కల్యాణ్‌ చక్రవర్తి, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 1న, ట్రైలర్‌ను డిసెంబర్ న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు. ఈ సినిమా 2026 జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Advertisement

Read Also :  ఏడేళ్ళ తర్వాత తమ్ముడి చావుకి రివేంజ్… అండర్ వరల్డ్‌లో అన్న అరాచకం… ఒక్కొక్కడికీ దబిడి దిబిడే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×