E-Paper
Advertisement

OTT Movie : రిటైర్ అయ్యే టైంలో దెబ్బ కొట్టే కిల్లర్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రిటైర్ అయ్యే టైంలో దెబ్బ కొట్టే కిల్లర్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో ఎక్కువగా ఊహించని ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. ఆడియన్స్ ఆ ట్విస్టులతోనే చిల్ అవుతుంటారు. ఎంత ఎక్కువగా థ్రిల్ ని ఇస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలను చూస్తుంటారు ప్రేక్షకులు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా ఊహించని మలుపులు ఉంటాయి. ఈ కథ ఫ్రాంకో అమోర్ అనే పోలీసు అధికారి రిటైర్మెంట్ ముందు రాత్రి జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. థ్రిల్లర్ అభిమానులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్’ (Last Night of Amore) 2023లో విడుదలైన ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇది ఆండ్రియా డి స్టెఫానో డైరెక్ట్ చేసిన సినిమా. ఈ సినిమా 73వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 104 నిమిషాల నిడివితో ఐయండిబిలో 7.1/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అమోర్ అనే 59 ఏళ్ల పోలీసు లెఫ్టినెంట్, తన 35 సంవత్సరాల సర్వీస్ లో ఎప్పుడూ ఎవరినీ చంపడానికి తుపాకీ ఉపయోగించలేదని, నిజాయితీగా పనిచేశానని గర్వపడుతుంటాడు. అతని రిటైర్మెంట్ ముందు రోజు రాత్రి తన ఫెయర్‌వెల్ స్పీచ్ ని కూడా రాస్తుంటాడు. అతని మొదటి భార్య చనిపోయిన తర్వాత, తన కన్నా వయసులో బాగా చిన్నదైన వివియానాను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. ఆమె రిటైర్మెంట్ సర్‌ప్రైజ్ పార్టీ ప్లాన్ చేస్తుంటుంది. అకస్మాత్తుగా అమోర్ కి పోలీసు చీఫ్ కాల్ చేసి, అమోర్ బెస్ట్ ఫ్రెండ్ డినో ఒక షూటౌట్‌లో చనిపోయాడని చెప్తాడు. డినో డైమండ్స్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, రోడ్ అండర్‌పాస్‌లో ఈ దాడి జరిగింది.

Read Also : 50 కి పైగా అవార్డులు…15 ఏళ్ల పాపకు నరకం చూపించే సైకోలు… గుండె తరుక్కుపోయే స్టోరీ

అమోర్ ఇప్పుడు రిటైర్మెంట్ పార్టీ వదిలేసి క్రైమ్ సీన్‌కు వెళ్తాడు. ఇది మాఫియా గ్యాంగ్‌స్టర్ కోసిమో పనిగా అనుమానిస్తాడు. ఆ రాత్రి అతని జీవితంలో అత్యంత ప్రమాదకరమైన రాత్రిగా మారుతుంది. అమోర్ సొంతంగా దర్యాప్తు మొదలుపెడతాడు. ఈ దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు బయట పడతాయి. క్లైమాక్స్ లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్లు వస్తాయి. చివరికి అమోర్ ఈ కేసులో బయట పెట్టే నిజాలు ఏమిటి ? డినో ని ఎవరు చంపారు ? ఈ కేసులో అయినా అమోర్ గన్ వాడుతాడా ? తన రిటైర్మెంట్ ని సెలెబ్రేట్ చేసుకుంటాడా ? అనే విషయాలను, ఈ ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×