E-Paper
Advertisement

OTT Movie : పిల్ల పుట్టి చనిపోయిందని గొర్రెను పెంచుకునే పేరెంట్స్… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం జబర్దస్త్

OTT Movie : పిల్ల పుట్టి చనిపోయిందని గొర్రెను పెంచుకునే పేరెంట్స్… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం జబర్దస్త్
Advertisement

OTT Movie : సినిమా ఇప్పుడు నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా సినిమాల వైపే చూస్తున్నారు జనాలు. అయితే థియేటర్ లనుంచి ఓటీటీ లోకి ఇప్పుడు అన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అటువంటి మూవీ గురించి ఈ రోజు మనం చెప్పుకుందాం. ఇందులో పిల్లలు లేని దంపతులకు ఒక వింత జీవి దొరుకుతుంది. దానిని ఆ దంపతులు సొంత పిల్లలా పెంచుతారు. ఆతరువాత కొన్ని దారుణమైన సంఘటనలు జరుగుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో

Advertisement

ఈ మూవీ పేరు ‘లాంబ్’ (Lamb). 2021 లో విడుదలైన ఈ ఐస్‌లాండిక్ ఫోక్ హారర్ మూవీకి వాల్డిమార్ జోహన్సన్ దర్శకత్వం వహించారు. ఇందులో నోవామీ రాపస్, హిల్మిర్ స్నేర్ గుడ్‌నాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక వింత గొర్రె చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నాలుగు మిలియన్లు వసూలు చేసింది. ఇది 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం కోసం పోటీ పడింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

మరియా, ఇంగ్వర్ అనే దంపతులు ఐస్‌లాండ్‌లోని ఒక ప్రాంతంలో, గొర్రెల పెంపకం చేస్తూ జీవిస్తుంటారు. వారి జీవితం రొటీన్‌గా సాగుతూ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా గడిపి కూడా చాలా రోజులు అవుతుంది. గతంలో వాళ్ళకు ఒక ఆడ బిడ్డ పుడుతుంది. పుట్టిన కొన్ని రోజులకే ఆమె  చనిపోతుంది. ఆ బాధను వాళ్ళు ఇంకా భరిస్తున్నారు. అయితే ఒక రోజు వారి గొర్రెలలో ఒకటి అసాధారణమైన జీవికి జన్మనిస్తుంది. అది సగం గొర్రె, సగం మానవ రూపంలో ఉంటుంది. దానిని చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోతారు. ఇక దానిని తమ సొంత బిడ్డలా చూసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ జీవికి వారు ‘అడా’ అని పేరు పెట్టి పిలుస్తారు. ఆ పేరు ఒకప్పుడు తమ కూతురుకు పెట్టి ఉంటారు. ఇక అప్పట్నుంచి వారి జీవితంలో అడా ఆనందాన్ని తెస్తుంది. వారి ఒంటరితనాన్ని, గత బాధలను మరచిపోయేలా చేస్తుంది.

కొన్ని రోజులకు ఇంగ్వర్ సోదరుడు పేటుర్ వారి ఇంటికి వస్తాడు. అడా గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. ఒకసారి దానిని చంపాలి అనుకుంటాడు. అలా  చేయలేక, అతను కూడా క్రమంగా అడాతో బంధం పెంచుకుంటాడు. ఇలా సాగిపోతున్న క్రమంలో ఊహించని సంఘటన ఎదురు పడుతుంది. అడా కు సంభందించిన ఒక భయంకరమైన జీవి అక్కడికి వస్తుంది. అది మరెవరో కాదు సగం గొర్రె, సగం మానవ రూపంలో ఉండే అడా తండ్రి. అది రావడంతో వీళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి. చివరికి ఇంగ్వర్ దంపతులకు అడా తండ్రి వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అడాను తన తండ్రి తీసుకెళ్తాడా ? ఈ విసహయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×