E-Paper
Advertisement

Netflix OTT : సబ్స్క్రయిబర్లకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్… పాపులర్ సినిమాలు, సిరీస్ లు డిలీట్

Netflix OTT : సబ్స్క్రయిబర్లకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్… పాపులర్ సినిమాలు, సిరీస్ లు డిలీట్
Advertisement

Netflix OTT : నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి వారం ఈ ప్లాట్‌ఫామ్‌లో కొత్త సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అయితే మూవీ లవర్స్ కోసం తాజాగా ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. 2026 నుండి నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ నుండి అనేక పాపులర్ సినిమాలు, సిరీస్ లను తొలగించింది. ఈ జాబితాలో హాలీవుడ్ క్లాసిక్‌ల నుండి బిలియన్ డాలర్ల ఫ్రాంచైజీల వరకు అన్నీ ఉన్నాయి. జనవరి 1న వాటిని డిలీట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం వీక్షకులకు పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు. ఎందుకంటే డిలీట్ అయిన వాటిలో ఆల్-టైమ్ ఫేవరెట్‌లు, కల్ట్ క్లాసిక్‌లు కూడా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ నుండి ఎందుకు తొలగిస్తున్నారు?

ఈ సినిమాలు, షోలలో జాక్ బ్లాక్, ఏంజెలీనా జోలీ, బ్రాడ్లీ కూపర్, డ్వేన్ జాన్సన్, డకోటా జాన్సన్, మాట్ డామన్ వంటి పెద్ద స్టార్ల సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈ వార్త అభిమానులకు కొంచెం నిరాశ కలిగించవచ్చు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ దాని కంటెంట్ లైబ్రరీని తిరిగి రూపొందిస్తోంది. అందులో భాగంగానే లైసెన్స్ వ్యవధి ముగియడం వల్ల అనేక సినిమాలు ప్లాట్‌ఫామ్ నుండి డిలీట్ చేశారు. మరి నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేసిన సినిమాలు, సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి.

Netflix డిలీట్ చేసిన సినిమాలు

Advertisement

క్రూకెడ్ హౌస్
ఆక్వామన్ అండ్ లాస్ట్ కింగ్డమ్
బేబీ డ్రైవర్
కోచ్ కార్టర్
బ్లూ స్ట్రీక్
బ్లూ క్రష్
బ్లూ బీటిల్
కెప్టెన్ ఫిలిప్స్
క్రేజీ రిచ్ ఆసియన్లు
డర్టీ డ్యాన్సింగ్
ది మార్టిన్
టాక్సీ డ్రైవర్
స్కార్ఫేస్
ఓషన్స్ 8
డోన్నీ డార్కో
డాడ్జ్‌బాల్
ది మాస్క్
ది గూనీస్
డ్రీమ్‌గర్ల్స్
డాక్టర్ స్లీప్

నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించిన ఫ్రాంచైజీలు

కుంగ్ ఫూ పాండా (మొత్తం ఫ్రాంచైజీ)
ది హ్యాంగోవర్ సిరీస్
ఫిఫ్టీ షేడ్స్ సిరీస్
జి.ఐ. జో
లారా క్రాఫ్ట్ / టూంబ్ రైడర్
మేజ్ రన్నర్ సిరీస్

నెట్ ఫ్లిక్స్ డిలీట్ చేసిన టీవీ షోలు/సిరీస్ లు

Advertisement

మిస్టర్ రోబోట్
ప్రిజన్ బ్రేక్
హౌస్ ఆఫ్ లైస్
స్టార్ ట్రెక్

అయితే వీటిలో కుంగ్ ఫూ పాండా, ది హ్యాంగోవర్ సిరీస్, ఫిఫ్టీ షేడ్స్ సిరీస్, జి.ఐ. జో, లారా క్రాఫ్ట్ / టూంబ్ రైడర్, మేజ్ రన్నర్ సిరీస్ వంటి ఫ్రాంచైజీలకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఈ సినిమాలను ఎప్పుడు పడితే అప్పుడు చూసేంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు అవి నెట్ ఫ్లిక్స్ లో దొరకవు అనేది నిజంగా డిసప్పాయింట్ చేసే వార్తే. ముఖ్యంగా ‘ఫిఫ్టీ షేడ్స్’ ఫ్రాంచైజీకి వీరాభిమానులు ఉన్నారు. మరి ఆ లోటును నెట్ ఫ్లిక్స్ ఎలా భర్తీ చేస్తుందో చూడాలి.

Read Also :  న్యూయర్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు.. మస్ట్ వాచ్..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×