E-Paper
Advertisement

OTT Movie : వెంటాడి, వేటాడి చంపే పాయిజనస్ పొగ… వెనకడుగు వేస్తే నరకానికి డైరెక్ట్ టిక్కెట్

OTT Movie : వెంటాడి, వేటాడి చంపే పాయిజనస్ పొగ… వెనకడుగు వేస్తే నరకానికి డైరెక్ట్ టిక్కెట్
Advertisement

OTT Movie : కష్ట సమయంలో కుటుంబం కోసం పోరాడటం, ధైర్యం చూపడం వంటివి చేసే సాధారణ వ్యక్తే అసాధారణ పరిస్థితుల్లో హీరోగా మారతాడు. నిరాశలో ఉన్న జనాల్లో ఆశని నింపి, కాపాడే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ఓ కొరియన్ సినిమా గురించే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. ప్రపంచాన్ని నాశనం చేసే ఓ పొగ నుంచి ఈ హీరో అందరినీ ఎలా బయట పడేశాడు అన్నది స్టోరీ. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

స్టోరీలోకి వెళ్తే…
యాంగ్-నామ్ (చో జంగ్-సియోక్) ఒక నిరుద్యోగి. అతడికి రాక్ క్లైంబింగ్‌ లో మంచి ట్యాలెంట్ ఉంటుంది. కానీ లైఫ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోతాడు. తన కుటుంబంతో సియోల్‌లో నివసించే హీరో గురించి అతని తల్లి (గో డు-షిమ్) ఎప్పుడూ ఆందోళన చెందుతుంది.

Advertisement

యాంగ్-నామ్ తన తల్లి 70వ పుట్టినరోజు వేడుకను సియోల్‌ లోని ఒక బ్యాంక్వెట్ హాల్‌ లో ఏర్పాటు చేస్తాడు. అక్కడ తన కాలేజీ స్నేహితురాలు ఈ-జూ (ఇమ్ యూనా)ని కలుస్తాడు. ఆమె అదే హాల్‌ లో అసిస్టెంట్ మేనేజర్‌ గా పని చేస్తుంది. యాంగ్-నామ్ కి కాలేజీ రోజుల్లోనే కాదు ఇప్పటికీ ఆమె అంటే ఇష్టమే. కానీ ఈ-జూ అతనొక జాబ్ లెస్ ఫెల్లో అన్న కారణంతో అతనిపై ఇంట్రెస్ట్ చూపించదు.

బర్త్ డే వేడుక జరుగుతున్న సమయంలో, ఒక విష వాయువు (క్లోరిన్ గ్యాస్) సియోల్ నగరంలో వ్యాపించడం ప్రారంభమవుతుంది. ఈ వాయువు ఒక ఉగ్రవాద దాడి కారణంగా విడుదలవుతుంది. దీన్ని పీల్చిన వారిని తక్షణమే చంపేస్తుంది. విష వాయువు నగరంలో తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తుంది. కాబట్టి బతకడానికి ఏకైక మార్గం ఎత్తైన ప్రదేశాలకు చేరుకోవడం. యాంగ్-నామ్, ఈ-జూ తమ కుటుంబాలను, ఇతరులను కాపాడాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

యాంగ్-నామ్ తన రాక్ క్లైంబింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, భవనాల మధ్య గోడలను ఎక్కడం, తాడులను ఉపయోగించడం, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడం చేస్తాడు. ఈ-జూ తన తెలివితేటలు, ధైర్యంతో అతనికి సహాయం చేస్తుంది. ఈ క్రమంలో కామెడీ నుంచి ఎమోషన్ దాకా సినిమాలో నవరసాలు ఉంటాయి. మరి చివరికి ఈ ప్రమాదం నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు ? ఒక భవనం పై నుంచి మరో భవనంపైకి దూకడం అన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని కిందకి వెళ్లలేరు. మరి చివరికి వీళ్ళంతా ఆ డిజాస్టర్ నుంచి ఎలా బయటపడ్డారు ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెరపై చూడాల్సిందే. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, స్టంట్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. పక్కా వర్త్ వాచింగ్ మూవీ మావా.

Read Also : అంతుచిక్కని వ్యాధితో వరుస మరణాలు… మతిపోగొట్టే ట్విస్ట్ లున్న సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్

ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు “Exit”. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక దక్షిణ కొరియా యాక్షన్-కామెడీ డిజాస్టర్ సినిమా. దీనికి లీ సాంగ్-గ్యూన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×