E-Paper
Advertisement

Korean Drama OTT : వెయ్యేనుగుల బలం ఒక్క అమ్మాయిలో… అడ్డొచ్చినోళ్లను అడ్డంగా… ప్రతి ఎపిసోడ్ బీభత్సమే

Korean Drama OTT : వెయ్యేనుగుల బలం ఒక్క అమ్మాయిలో… అడ్డొచ్చినోళ్లను అడ్డంగా… ప్రతి ఎపిసోడ్ బీభత్సమే
Advertisement

Korean Drama OTT : ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కే డ్రామాలు ఓ రేంజ్ లో పాపులర్ అవుతున్నాయి. వీళ్ళ మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటోంది. ఇక డ్రెస్సింగ్ స్టైల్ కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2017లో వచ్చిన ఒక సిరీస్ సూపర్ఇ, డూపర్ హిట్ అయింది. ఇది రొమాంటిక్, కామెడీ, ఫాంటసీ, యాక్షన్ వంటి థీమ్స్ తో అదరగొట్టింది. ఇందులో హీరోయిన్ కు అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆమె పెద్ద ట్రక్కులను కూడా తేలికగా ఎత్తగలదు. ఇక ఆమె లవ్ ట్రాక్ మరో లెవెల్ లో సాగుతుంది. యాక్షన్ సీన్స్ కూడా అబ్బురపరుస్తాయి.
ఈ డ్రామా క్రేజ్ చూసి, అమెరికాలో కూడా దీనిని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సూపర్ హిట్ సౌత్ కొరియన్ సిరీస్ పేరు ‘స్ట్రాంగ్ గర్ల్ బాంగ్-సూన్’ (Strong Girl Bong-soon). ఇందులో పార్క్ బో-యంగ్, పార్క్ హ్యుంగ్-సిక్, జి సూ ప్రధాన పాత్రల్లో నటించారు. మెయిన్ లీడ్స్ అయిన పార్క్ బో-యంగ్, పార్క్ హ్యుంగ్-సిక్ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. వీరిద్దరిని అభిమానులు ముద్దుగా ‘పప్పీ కపుల్’ అని కూడా పిలుచుకుంటారు. ఈ డ్రామాలో తన నటనకు గానూ పార్క్ బో-యంగ్ ‘బెస్ట్ యాక్ట్రెస్’ గా పలు అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా ఆమె కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి ఇందులో. ఈ సీరీస్ అప్పట్లో JTBC అనే కొరియన్ కేబుల్ టీవీ ఛానెల్‌లో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. దీని పాపులారిటీ వల్లనే 2023లో దీనికి సీక్వెల్‌గా ‘స్ట్రాంగ్ గర్ల్ నామ్-సూన్’ (Strong Girl Nam-soon) తీశారు. 16 ఎపిసోడ్లు ఉన్న ఈ డ్రామా ప్రస్తుతం Netflix, Viki ప్లాట్‌ ఫా మ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హీరోయిన్ బాంగ్-సూన్ చూడటానికి పొట్టిగా, అమాయకంగా ఉంటుంది కానీ, ఆమె ఒంట్లో ఏనుగు బలం ఉంటుంది. వాళ్ల వంశంలో ఆడవాళ్లందరికీ పుట్టుకతోనే ఈ అద్భుత శక్తి వస్తుంది. రోడ్డు మీద ఎవరైనా రౌడీలు అతి చేస్తే చాలు, వాళ్లని గాలిలో పల్టీలు కొట్టించి, ఎముకలు విరగ్గొట్టేస్తుంది. కానీ తన చిన్ననాటి క్రష్, పోలీస్ ఆఫీసర్ అయిన గుక్-దూ ముందు మాత్రం ఏమీ తెలియని పద్ధతైన అమ్మాయిలా బిల్డప్ ఇస్తుంటుంది. ఎందుకంటే అతనికి సాఫ్ట్‌గా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం.

మరోపక్క ఒక పెద్ద గేమింగ్ కంపెనీకి ఓనర్ అయిన మిన్-హ్యుక్, హీరోయిన్ పవర్ చూసి ఫిదా అయిపోతాడు. ఎవరో గుర్తుతెలియని వాళ్లు తనని చంపాలని ప్లాన్ చేస్తున్నారని భయపడి, బాంగ్-సూన్‌ను తన పర్సనల్ బాడీగార్డ్‌గా పెట్టుకుంటాడు. వీళ్లిద్దరి మధ్య మొదట్లో చిన్న చిన్న గొడవలు జరిగినా, తర్వాత ఆ తిక్కలోడే ఆమె ప్రేమలో పడిపోతాడు. వాళ్లిద్దరూ కలిసి చేసే కామెడీ, రొమాన్స్ మామూలుగా ఉండదు, ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇంతలో ఊరిలో ఒక సైకో వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ అందరినీ భయపెడుతుంటాడు. ఆ సైకోని పట్టుకోవడానికి బాంగ్-సూన్ రంగంలోకి దిగుతుంది. చివరికి ఆ సైకోని బాంగ్-సూన్ పట్టుకుంటుందా ? ఆమె ఎవరితో ప్రేమను పంచుకుంటుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  తండ్రి కర్మకాండలో కలిసిన స్నేహం… ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న మరాఠి ప్రేమకథ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×