E-Paper
Advertisement

OTT Movie : వర్షం పడితే మూడ్ వచ్చే సైకో…. రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్

OTT Movie : వర్షం పడితే మూడ్ వచ్చే సైకో…. రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్
Advertisement

OTT Movie Memories of Murder : కొరియన్ సినిమాలు గ్రిప్పింగ్ కథలతో, డీప్ ఎమోషన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ స్టోరీలు, డార్క్ థీమ్స్‌తో అందరినీ ఆకర్షిస్తాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా, టెన్షన్, మిస్టరీ నిండిన సినిమా కావాలంటే, ఇది మీ కోసమే. ఈ సినిమా దక్షిణ కొరియాలోని హ్వాసియోంగ్ సీరియల్ కిల్లింగ్స్ ఆధారంగా రూపొందింది. ఈ థ్రిల్లింగ్ మాస్టర్‌పీస్ ను ఎక్కడ చూడొచ్చో ఓ లుక్కేద్దాం పదండి.

రెండు ఓటీటీలలో
రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘Memories of Murder’. బాంగ్ జూన్-హో దర్శకత్వంలో, కిమ్ క్వాంగ్-రిమ్, షిమ్ జే-మ్యుంగ్, బాంగ్ జూన్-హో రచనతో, సిజె ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 2003లో రిలీజైంది. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, MUBI ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఈ సినిమా 2003 గ్రాండ్ బెల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ (బాంగ్ జూన్-హో), బెస్ట్ యాక్టర్ (సాంగ్ కాంగ్-హో) అవార్డులను గెలుచుకుంది. దీని రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ, డార్క్ హ్యూమర్, సాంగ్ కాంగ్-హో నటన 2003లో దీనిని ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చాయి.

Advertisement

కథలోకి వెళ్తే…
1986-1991 మధ్య దక్షిణ కొరియాలోని హ్వాసియోంగ్‌లో జరిగిన నిజమైన సీరియల్ కిల్లింగ్స్ ఆధారంగా రూపొందిన కథ. ఈ సినిమా ఒక గ్రామీణ పట్టణంలో జరిగే హత్యల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ యంగ్ అమ్మాయిలపై అఘాయిత్యం చేసి, క్రూరంగా చంపేస్తారు. ఈ కేసును స్థానిక డిటెక్టివ్ పార్క్ డూ-మాన్ (సాంగ్ కాంగ్-హో), అతని పార్ట్‌నర్ చో యాంగ్-గూ (కిమ్ రో-హా) దర్యాప్తు చేస్తారు. పార్క్ అనుభవం లేని డిటెక్టివ్. సాధారణ పద్ధతులతో, అనుమానితులను బలవంతంగా ఒప్పించడం ద్వారా కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు.

సియోల్ నుండి వచ్చిన డిటెక్టివ్ సియో టే-యూన్ (కిమ్ సాంగ్-క్యుంగ్) లాజికల్, సీరియస్ ఇన్వెస్టిగేటర్ ఈ కేసులో చేరతాడు. ఇద్దరూ కలిసి హంతకుడిని పట్టుకోవడానికి పని చేస్తారు. హత్యలు ఒక ప్యాటర్న్‌లో జరుగుతాయి. వర్షం పడిన రాత్రి, ఎరుపు రంగు దుస్తులు ధరించిన అమ్మాయిల్నే టార్గెట్ చేసి చంపుతాడు ఈ కిల్లర్. ఆ టైంలో ఒక రేడియో పాట వినిపిస్తుంది. డిటెక్టివ్‌లు ఎంతోమంది అనుమానితులను దర్యాప్తు చేస్తారు.

Advertisement

వారిలో బేక్ క్వాంగ్-హో (పార్క్ నో-షిక్) అనే మానసిక సమస్యలు ఉన్న వ్యక్తి, పార్క్ హ్యున్-గ్యూ (పార్క్ హే-ఇల్) అనే సాఫ్ట్‌స్పోకెన్ యువకులను అనుమానిస్తారు. సియో టే-యూన్ లాజికల్ ఇన్వెస్టిగేషన్‌పై ఆధారపడితే, పార్క్ డూ-మాన్ తన ఇన్‌స్టింక్ట్‌లను నమ్ముతాడు. దీని వల్ల ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. కేసు మరింత జటిలంగా మారుతుంది. దీంతో హత్యలు జరుగుతూనే ఉంటాయి. మరి ఇంతకీ ఆ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? చివరికి వాడిని పట్టుకున్నారా లేదా ? అనేది ఈ సినిమాను చూసి తెలుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×