E-Paper
Advertisement

కూతురు కోసం ప్రపంచాన్ని పీకి పందిరేసే తండ్రి… ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

కూతురు కోసం ప్రపంచాన్ని పీకి పందిరేసే తండ్రి… ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా
Advertisement

Korean Action Thriller: తండ్రీకూతుర్ల బంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూతురికి తండ్రే ప్రపంచం, కూతురు కోసం ఏమైనా చేసే ప్రేమ తండ్రిది. ఆమె కోసం ఆ ఫాదర్ కావాలంటే హీరో అవుతాడు. లేదంటే విలన్ అవ్వడానికి కూడా వెనకాడడు. హీరో అయినా, విలన్ అయినా… ఇద్దరికీ కూతురంటే ఒక ఎమోషన్. మరి ప్రాణంగా ప్రేమించే ఆ కూతురే మిస్ అయితే… పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే, హై-వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్’ (Agent Kim Reactivated)ను చూడాల్సిందే. 2026లో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కిమ్ దో-హ్యూన్ మన హీరో. ఒక చిన్న సేవింగ్స్ బ్యాంక్‌లో కష్టపడి పని చేసే మేనేజర్. భార్యను కోల్పోయిన అతను, తన అల్లరి టీనేజ్ కూతురు మిన్-జితో కలిసి ప్రశాంతంగా బతుకుతాడు. తండ్రీకూతుళ్ల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నప్పటికీ, ఆమె అంటే అతనికి ప్రాణం. పైకి అమాయకంగా కనిపించే కిమ్ వెనుక ఒక భయంకరమైన గతం ఉంటుంది.

Advertisement

అతను గతంలో ఉత్తర-దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతం చేసిన అత్యంత క్రూరమైన, ప్రమాదకరమైన ‘బ్లాక్-ఆప్స్ ఎలైట్ సీక్రెట్ ఏజెంట్’. శత్రువుల పాలిట యముడిగా నిలిచిన అతను, ఉత్తర కొరియా మోస్ట్ వాంటెడ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటాడు. తన కూతురి భద్రత కోసమే తన నిజమైన గుర్తింపును దాచి, సాదాసీదా జీవితం గడుపుతుంటాడు.

ఒకరోజు ఒక మాఫియా ముఠా మిన్-జిని మాయం చేస్తుంది. పోలీసుల సహాయం కోసం చూస్తే లాభం లేదని గ్రహించిన కిమ్, తన కూతురిని రక్షించుకోవడానికి తనలోని పాత సీక్రెట్ ఏజెంట్‌ను మళ్లీ నిద్రలేపుతాడు. కూతురిని రక్షించే క్రమంలో అతను ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ షాకింగ్ నిజాలు బయటపడతాయి.

Advertisement

హాలీవుడ్ హిట్ చిత్రం ‘టేకెన్’, ‘జాన్ విక్’ తరహాలో సాగే ఈ సిరీస్‌లో, కిమ్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ తో మాఫియా గ్యాంగ్‌లను చీల్చిచెండాడతాడు. మరి ఆయన తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు ? అసలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరు ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే ఈ బ్లడీ బ్లడ్ బాత్ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

ఈ హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం లేదు సిరీస్. చూడాలనుకుంటే ఇంగ్షీషులోనే చూడక తప్పదు. యాక్షన్ ప్రియులు డోంట్ మిస్.

Read Also: భారీ యాక్షన్ సీన్స్ లేవు, స్టంట్స్ లేవు… టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×