E-Paper
Advertisement

OTT Movie : తమ్ముడి చావుకి అన్న రివేంజ్… ఓటీటీలో అదరగొడుతున్న యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : తమ్ముడి చావుకి అన్న రివేంజ్… ఓటీటీలో అదరగొడుతున్న యాక్షన్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : మలయాళ సినిమాలకి మనవాళ్లు అభిమానులుగా మారిపోయారు. ఈ సినిమాలను చక్కటి కథలతో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. థియేటర్లలో, ఓటిటిలలో కూడా ఈ సినిమాలు అదరగొడుతున్నాయి. అన్ని భాషల్లో ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సముద్ర తీరంలోనే ఎక్కువగా జరుగుతుంది. తమ్ముడి చావుకి ప్రతీకారం తీర్చుకునే అన్న చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

Advertisement

ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కొండల్’ (Kondal). 2024 లో విడుదలైన ఈ మలయాళ మూవీకి అజిత్ మాంపల్లి దర్శకత్వం వహించారు. ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ ఒక సముద్రతీర గ్రామంలో జరుగుతుంది. ఎక్కువగా ఒక చేపలు పట్టే బోట్‌లో స్టోరీ తిరుగుతుంది. ‘కొండల్’ ఒక సాధారణ ప్రతీకార సినిమానే అయినప్పటికీ, సముద్ర నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలు దీనిని విభిన్నంగా నిలబెడతాయి. ఈ మూవీ 2024సెప్టెంబర్ 13 న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 13 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

అంచుతెంగు అనే తీర గ్రామంలో మాన్యువెల్ అనే ఒక మత్స్యకారుడు నివసిస్తూ ఉంటాడు. మాన్యువెల్ ముక్కు సూటిగా, ధైర్యవంతుడైన వ్యక్తిగా ఉంటాడు. అతను శక్తివంతమైన వ్యక్తులను కూడా సవాలు చేయడానికి వెనుకాడడు. అయితే అతని ఈ స్వభావం కారణంగా గ్రామంలో ఒక సమస్యలో చిక్కుకుంటాడు. దీనివల్ల అతను తాత్కాలికంగా గ్రామాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను మరొక ఓడరేవులో చేపలు పట్టే బోట్‌లో పని చేయడానికి చేరతాడు. ఈ బోట్‌లో సుమారు 15 మంది సిబ్బంది వరకు ఉంటారు. వారు సముద్రంలో లోతుగా కూడా ప్రయాణిస్తారు. అయితే ఈ ప్రయాణంలో ఒక విషాదకర సంఘటన జరుగుతుంది. సముద్రంలో ప్రయాణం చేస్తున్న సిబ్బందిలో ఒకరు అనుకోకుండా మరణిస్తాడు. ఈ సంఘటనతో సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటుంది.  మరొక వర్గం మాన్యువెల్ నాయకత్వంలో తీరానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటుంది.

ఈ విభజన తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. కథ లోతుగా వెళితే మాన్యువెల్ ఈ బోట్‌లో చేరడానికి ఒక రహస్య కారణం ఉందని తెలుస్తుంది. అతని సోదరుడు డానీ మరణానికి సంబంధించిన రహస్యాన్ని కనుగొని, వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకొని ఇక్కడికి వస్తాడు. అదే బోట్‌లో కొందరు సిబ్బంది డానీ మరణంలో పాలుపంచుకున్న వారని మాన్యువెల్ సందేహిస్తాడు. ఈ నేపథ్యంలో బోట్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటాయి. మాన్యువెల్ తన ప్రతీకార ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లతో కథ ముందుకు వెళ్తుంది. చివరికి మాన్యువెల్ తన తమ్ముడి చావుకి ప్రతీకారం తీర్చుకున్నాడా ? అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘కొండల్’ (Kondal) అనే మూవీని చూడండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×