E-Paper
Advertisement

నిండు గర్భిణిని సొంత భర్తే చంపే స్పైన్ చిల్లింగ్ మలయాళం థ్రిల్లర్

నిండు గర్భిణిని సొంత భర్తే చంపే స్పైన్ చిల్లింగ్ మలయాళం థ్రిల్లర్
Advertisement

Psychological Thriller : గూస్ బంప్స్ తెప్పించే ఓ మంచి సైకలాజికల్ థ్రిల్లర్ గురించి ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఆ సినిమా మరేదో కాదు… 2026 మార్చి 13న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ చిత్రం ‘కొలైసేవల్’(Kolaiseval). కలైయరసన్, దీపా బాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వి. ఆర్. తుధివానన్ దర్శకత్వం వహించారు. సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న ఆనర్ కిల్లింగ్స్, మూఢనమ్మకాలను నేపథ్యంగా చేసుకుని తీసిన రూరల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఈ మైండ్ బ్లోయింగ్ మూవీ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది.

కథలోకి వెళ్తే…

కథ తిరువణ్ణామలై జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో సాగుతుంది. ఆ ఊరిలో 200 ఏళ్ల నాటి వింత ఆచారం ఒకటి ఉంటుంది. ఏ మహిళైనా గర్భవతి అయితే, ఆమె కుటుంబంతో కలిసి దట్టమైన అడవి మధ్యలో ఉన్న కులదేవత గుడికి వెళ్లి పొంగలి వండి, మేకను బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో హీరోయిన్ అనసూయ (దీపా బాలు). ఆమె తొమ్మిదో నెల గర్భవతిగా ఉండగా, ఆమె భర్త కాళి (కలైయరసన్) ఉమ్మడి కుటుంబంతో కలిసి ఈ మొక్కు తీర్చడానికి అడవి ప్రయాణం మొదలు పెడతాడు.

Advertisement

మొదటి భాగం అంతా ఫ్యామిలీ ఎమోషన్స్, గ్రామీణ సరదాలు, ఆచారాలతో సాగుతుంది. కానీ పూజ ముగిసిన తర్వాత కథ పూర్తి మలుపు తిరుగుతుంది.అనసూయ ప్రేమ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె సొంత కుటుంబ సభ్యులు పగతో రగిలిపోతారు. ఆ దట్టమైన అడవిలోనే వీరిపై దాడికి తెగబడతారు. గర్భవతి భార్యను కాపాడుకుంటూ, కాళి ఒక్కడే ఎలా పోరాడతాడు ? అందరి నుంచి తప్పించుకుని ఆ జంట బయట పడిందా లేదా ? అన్నది స్టోరీ. ఆ ప్రమాదకర అడవిలో జరిగే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఫీల్ ఇస్తాయి.

కలైయరసన్ భార్య, బిడ్డను కాపాడుకోవడానికి పోరాడే భర్తగా గట్టి అద్భుతమైన నటనను చూపించాడు. దీపా బాలు గర్భవతి అనసూయ పాత్రలో భావోద్వేగాలు, భయం, ధైర్యం అన్నీ సహజంగా అందించింది. థియేటర్లలో విడుదలై కొన్ని వారాల్లోనే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చేసింది. ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే Sun NXTలో కూడా అందుబాటులో ఉంది. అలాగే Airtel Xstream Play ద్వారా కూడా ఈ మూవీని చూడవచ్చు. ప్రస్తుతం తమిళ్ ఆడియోతోనే స్ట్రీమ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఒకవేళ భాష అడ్డు కాదనుకుంటే ఈ మూవీపై వెంటనే ఓ లుక్కేయండి.

Advertisement

Read Also : ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం థ్రిల్లర్లు… అన్నీ తెలుగులోనే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×