// // Kishkindhapuri OTT - 'కిష్కింధపురి' ఓటీటీ డేట్‌ వచ్చేసింది.. -->
E-Paper
Advertisement

Kishkindhapuri OTT: ‘కిష్కింధపురి’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Kishkindhapuri OTT: ‘కిష్కింధపురి’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!
Advertisement

Kishkindhapuri Movie OTT: బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘కిష్కింధపూరి‘. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 12న విడుదలైన మంచి విజయం సాధించింది. మొదట మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ ఈ తర్వాత మెల్లిమెల్లిగా హిట్‌ ట్రాక్‌ పడింది. ప్లాప్‌ అవుతుందనుకున్న ఈ సినిమా వసూళ్లలో మిరాయ్‌ చిత్రానికే పోటీ పడింది. ఫైనల్‌గా కిష్కింధపురితో బెల్లంకోండకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పడింది. ఎంతోకాలంగా హిట్‌ కోసం చూస్తున్న ఈ హీరోని ఈ సినిమా నిలబెట్టింది. థియేటర్లలో దుమ్ముదులిపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కి సిద్దమౌతుంది. త్వరలోనే ఈ హారర్‌ థ్రిల్లర్ ఓటీటీలో సందడి చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

మిక్స్డ్ టాక్ నుంచి హిట్ ట్రాక్..

Advertisement

కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో సస్పెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఇందులోని హారర్‌ ఎలిమెంట్స్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేశాయి. ఫస్ట్‌ డే మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. మెల్లిమెల్లిగా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది ఈ సినిమాకు. రోజురోజుకు థియేటర్లలో ఆక్యూపెన్సిని పెంచుకుంటూ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఫలితంగా కిష్కింధపూరి చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్‌ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. భారీ డిల్‌కి మూవీ రైట్స్‌ తీసుకున్న జీ5 ఇప్పుడు ఈ సినిమాను ఒకేసారి ఓటీటీ, టీవీలోకి తీసుకురాబోతోంది. తాజాగా టెవిజన్ ప్రీమియర్‌తో పాటు ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ని ప్రకటిస్తూ పోస్ట్‌ చేసింది జీ5. 

ఒకేసారి ఓటీటీ, టీవీలోకి..

కిష్కింధపురి మూవీని ఈ దీపావళి కానుకగా ఓటీటీ, టీవీల్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ అక్టోబర్‌ 17 సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమాను జీ5(Zee5)లో స్ట్రీమింగ్‌ ఇస్తున్నట్టు వెల్లడించింది. అదే విధంగా అక్టోబర్‌ సాయంత్రం 6 గంటలకు టెలివిజన్‌ ప్రసారంకి ఇస్తున్నట్టు సదరు సంస్థ పేర్కొంది. రోజుల వ్యవధిలోనే ఈ హారర్‌ థ్రిల్లర్‌.. ఓటీటీ, టీవీలో వస్తుండటంతో మూవీ లవర్స్‌ ఖుష్‌ అవుతున్నారు. దీపావళికి ఇంట్లోనే ఈ హారర్‌ థ్రిల్లర్‌ చూసి ఎంజాయ్‌ చెయొచ్చంటూ సినీ ప్రియులంత పండగ చేసుకుంటున్నారు. కాగా హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్ పాండే, హినా భాటియా, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్లు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మించారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందించారు.

Advertisement

కథేంటంటే..

రాఘవ్‌(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) మైథిలి (అనుపమ పరమేశ్వరన్‌) ఇద్దరు ప్రేమికులు. వీరిద్దరు కలిసి తమ ఫ్రెండ్స్ హైపర్‌ ఆది, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్‌తో కలిసి హోస్ట్‌ హంటింగ్‌ టూర్ చేస్తుంటారు. పాడుబడ్డ బంగ్లా, నిర్మానుషమైన ప్రదేశాలను ఎంచుకుని ఘోస్ట్‌ హంటింగ్‌ చేసి..ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి సువర్ణమాయ అనే పాడుపడిన రేడియో స్టేషన్‌ వస్తుంది. హీరోహీరోయిన్‌తో పాటు మరో పది మంది వారితో ఓ చిన్నారి కలిసి సువర్ణమాయ రేడియో స్టేషన్‌కి వెళతారు. అక్కడికి వెళ్లిన తొలి రోజే వారికి భయానక అనుభవం ఎదురవుతుంది. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ వారిలో ఒక్కొక్కరుగా చనిపోతూంటారు. అలాగే వారితో వెళ్లిన ఓ చిన్న పిల్లకు ప్రవర్తన వింతగా మారుతుంది. దీంతో ఈ మరణాలకు కారణం ఏంటి? సువర్ణమాయ రేడియో స్టేషన్‌ వెనక ఉన్న కథేంటో తెలుసుకునేందుకు హీరోహీరోయిన్లు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు, బయటపడ్డ సంచలన విషయాలు ఉత్కంఠ కలిగిస్తాయి. మరి చివరికి ఈ సువర్ణమాయ రేడియో స్టేషన్‌ కథేంటి? దీనికి వారు ఛేదించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read: Mirai Closing Collections: మిరాయ్‌ క్లోజింగ్‌ కలెక్షన్స్‌… లాభం ఎన్ని కోట్లంటే!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×