E-Paper
Advertisement

OTT Movie : పసిపాపకు ప్రాణాలు తీసే పవర్… ఆమె ముట్టుకుంటే మసే… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా?

OTT Movie : పసిపాపకు ప్రాణాలు తీసే పవర్… ఆమె ముట్టుకుంటే మసే… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా?
Advertisement

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. 19 వ శతాబ్ధంలో జరికే రెండు భయంకరమైన సంఘటనల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆ సమయంలో ప్లేగ్ మహమ్మరితో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే ఇదే సమయంలో ఒక పాపాకి వింత సమస్య వస్తుంది. ఆమె ఎవరినైతే ముట్టుకుంటుందో వాళ్ళు చనిపోతుంటారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఆమె తల్లి చసే పోరాటమే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో విడుదలైన ఈ సూపర్ నేచురల్ వెస్ట్రన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కిల్లింగ్ ఫెయిత్’ (Killing Faith). నెడ్ క్రౌలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ 1849 నాటి అమెరికా పశ్చిమ ప్రాంతంలో ప్లేగు వ్యాధి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో గై పియర్స్, డివాండా వైజ్, బిల్ పుల్‌మాన్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను Amazon Prime Video, Apple TV వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1849 నాటి అమెరికన్ పశ్చిమ ప్రాంతంలో, ప్లేగు వ్యాధితో అతలాకుతలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ సమయంలో సారా అనే నల్ల జాతి బానిస స్త్రీకి విముక్తి లభిస్తుంది. అయితే ఆమెకు ఉన్న ఒక చిన్న కూతురు వల్ల పెద్ద సమస్య వస్తుంది. ఆ పాపకు దెయ్యం పట్టిందని సారా బలంగా నమ్ముతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చేతులు తగిలిన ప్రతి జీవి చనిపోతుంటుంది. తన కూతురిని దీని నుంచి రక్షించుకోవడానికి, సారా ఒక సుదూర ప్రాంతంలో ఉన్న “ఫెయిత్ హీలర్” అనే భూత వైద్యుడి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఈ ప్రయాణానికి ఆమె స్టీల్ బెండర్ అనే వైద్యుడిని ఒప్పిస్తుంది. అతను సైన్స్ ని నమ్ముతూ, దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయి ఉంటాడు. డాక్టర్ బెండర్ ఆ అమ్మాయికి ఏదో ఒక అంటువ్యాధి ఉందని నమ్ముతాడు, కానీ సారా మాత్రం అది దెయ్యం పనే అని వాదిస్తుంది.

Read Also : హాంటెడ్ హౌస్ లో మోడ్రన్ భూతాలు… సినిమా డైరెక్టర్ తో మంతనాలు… వాటి జోలికెళ్తే దబిడి దిబిడే

ఈ ముగ్గురు ప్రమాదకరమైన ప్రాంతాల గుండా ఐదు రోజుల ప్రయాణం చేస్తారు. దారిలో ప్రమాదకరమైన శక్తులను ఎదుర్కొంటారు. బెండర్ తన సొంత కూతురును గతంలో ప్లేగు వ్యాధిలో కోల్పోయిన బాధతో ఉంటాడు. ఇక ముగ్గురూ అతన్ని చెరడానికి అలుపెరుగని ప్రయాణం చేస్తారు. చివరికి వీళ్ళు ‘ఫెయిత్ హీలర్’ ను కలుస్తారా ? సారా కూతురికి వచ్చిన వింత సమస్య పోతుందా ? ఆమెకి నిజంగానే దెయ్యం పట్టిందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సూపర్ నేచురల్ వెస్ట్రన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×