E-Paper
Advertisement

OTT Movie : తల్లి దండ్రుల మధ్య చిచ్చు పెట్టే కొడుకు … దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చే ప్రియురాలు …

OTT Movie : తల్లి దండ్రుల మధ్య చిచ్చు పెట్టే కొడుకు … దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చే ప్రియురాలు …
Advertisement

OTT Movie : కన్నౌజ్‌లో నివసించే సహిల్ కౌశల్ (ఆశుతోష్ రాణా), సంగీతా కౌశల్ (షీబా చడ్డా) అనే దంపతుల జీవితంలో గొడవలు రొటీన్ గా జరుగుతుంటాయి. ఒక సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీలో సహిల్ ఉద్యోగం చేస్తుంటాడు.  వీళ్ళ కొడుకు యుగ్ నోయిడాలో పనిచేస్తూ,  హోళీ సందర్భంగా ఇంటికి వస్తాడు. తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతుండటంతో, విసిగిపోయి ఒక షాకింగ్ సలహా ఇస్తాడు. ఉంటే సంతోషంగా ఉండమని, లేకపోతే విడిపోవాలని చెప్తాడు.  ఆశ్చర్యకరంగా కౌశల్ దంపతులు ఈ సలహాను సీరియస్‌గా తీసుకుని, విడాకుల కోసం దరఖాస్తు చేస్తారు. యుగ్ తన తల్లిదండ్రుల విడాకులను ఆపగలడా?  కౌశల్ కుటుంబం తమ బంధాలను తిరిగి నిలుపు కోగలదా ? ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసు కుందాం పదండి.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ కథ కన్నౌజ్‌లోని కౌశల్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. సహిల్ కౌశల్ ఒక సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీలో అకౌంటెంట్, తన కవ్వాలీ కలను పెళ్ళి తరువాత త్యాగం చేసినందుకు ఎప్పుడూ బాధపడుతుంటాడు. అయితే ఇతని భార్య సంగీతా, సుగంధ ద్రవ్యాల తయారీ హాబీలో సంతృప్తి పొందుతుంది. అయితే వీళ్ళు చిన్న చిన్న వాటికే ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. వాళ్ళ కొడుకు యుగ్, నోయిడాలో వాన్ గో అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తూ, తాను పెరిగిన గ్రామీణ వాతావరణాన్ని తక్కువ చేసి చూస్తుంటాడు. తల్లిదండ్రులు “అప్‌డేట్” కావాలని కోరుకుంటాడు. హోళీ సందర్భంగా ఇంటికి వచ్చినప్పుడు, తల్లిదండ్రుల గొడవలతో విసిగిపోయిన యుగ్, వాళ్ళు విడిపోవాలని సలహా ఇస్తాడు. యుగ్ సోదరి రీత్ కూడా కుటుంబ డైనమిక్స్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

అయితే ఆశ్చర్యకరంగా, సహిల్, సంగీతా ఈ సలహాను సీరియస్‌గా తీసుకుని విడాకుల దిశగా అడుగులు వేస్తారు. ఇది యుగ్ జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. మరో వైపు కియారా బన్సాల్‌ అనే అమ్మాయితో యుగ్ లవ్ ట్రాక్ నడుపుతుంటాడు.  ఆమె తల్లి దండ్రులు కూడా విడిపోయి ఉండటంతో, ఒక సంప్రదాయ కుటుంబ విలువలు ఉన్న ఇంటికి కోడాలుగా వెళ్ళాలని కోరుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న యుగ్  తన పేరెంట్స్ ను మళ్ళీ కలపాలని  అనుకుంటాడు. చివరికి సహిల్, సంగీతా నిజంగా విడాకులు తీసుకుంటారా ? యుగ్ తన సలహా వల్ల సృష్టించిన గందరగోళాన్ని ఎలా సరిదిద్దుతాడు ? కియారాతో అతని ప్రేమ నిలబడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : మొగుడు పోయిన దుఃఖంలో తల్లి … బాయ్ ఫ్రెండ్ ని ఏసేసె కూతురు … ట్విస్టులతో మెంటలెక్కించే సినిమా

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు (Kaushaljis vs Kaushal).2025 లో వచ్చిన ఈ సినిమాకు సీమా దేశాయ్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్, మెర్రీ గో రౌండ్ స్టూడియోస్, ముంబై టాకీజ్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో ఆశుతోష్ రాణా, షీబా చడ్డా, పవైల్ గులాటీ, ఈషా తల్వార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 21 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 135 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.6/10 రేటింగ్ ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×