E-Paper
Advertisement

Kannada Comedy Horror : ఐదు దెయ్యాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అభాగ్యుడు… ఓటీటీలోకి కన్నడ కామెడీ హారర్

Kannada Comedy Horror : ఐదు దెయ్యాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అభాగ్యుడు… ఓటీటీలోకి కన్నడ కామెడీ హారర్
Advertisement

Kannada Comedy Horror : భయం కంటే నవ్వుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ హారర్ కామెడీ సినిమాలు నడుస్తుంటాయి. ఆడియన్స్ కూడా ఇలాంటి కథలను బాగా ఆదరిస్తున్నారు కూడా. ఇలాంటి సినిమాలకు భాషతో కూడా ప్రమేయం ఉండదు. ఏ భాషలో వచ్చినా మంచి రెస్పాన్స్ పొందుతుంటాయి. ఇక రీసెంట్ గా ఓ కన్నడ హారర్ కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఆడియన్స్. ఐదుగురు దయ్యాలకు విముక్తి కలిగించడానికి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ ఉంటుంది. ఈ కన్నడ కామెడీ హారర్ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్

ఈ కన్నడ కామెడీ హారర్ సినిమా పేరు ‘GST’ (Ghosts in Trouble). నటుడు సృజన్ లోకేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇందులో సృజన్ లోకేష్, రజని భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 నవంబర్ 28 థియేటర్లలో విడుదలైంది. దీనికి చందన్ శెట్టి సంగీతం అందించగా, సందేష్ నాగరాజ్ నిర్మించారు. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో
(Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా కథ అంతా ఒక కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అతనికి అనుకోకుండా ఐదుగురు దయ్యాలతో పరిచయం అవుతుంది. సాధారణంగా దయ్యాలంటే అందరూ భయపడతారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఆ ఐదు దయ్యాలే ఈ హీరోకి బాడీగార్డ్స్ లాగా ఉండి అతన్ని అన్ని ఆపదలనుండి కాపాడుతుంటాయి. ఈ క్రమంలో జరిగే గొడవలు, దయ్యాలు చేసే అల్లరి ప్రేక్షకులకు మంచి కామెడీని పంచుతాయి. అయితే ఆ దయ్యాలు హీరో దగ్గరే ఎందుకు ఉన్నాయి. వాటి వెనుక ఉన్న గతం ఏంటి అనేది అసలు ట్విస్ట్. ఆ దయ్యాలకి ఏదో ఒక కోరిక తీరకుండానే చనిపోయి ఉంటారు. చివరకు హీరో తన తెలివితేటలతో ఆ దయ్యాల సమస్యలను ఎలా పరిష్కరించాడు? వాటికి శాంతిని చేకూర్చి ఎలా విముక్తి కలిగించాడు ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also :  హెబ్బా పటేల్ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి… దాదాపు రెండు నెలల తర్వాత… ఐయండిబిలో టాప్ రేటింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×