E-Paper
Advertisement

OTT Movie : ఇద్దరు పిల్లల తల్లి కోసం రాబందుల్లా… ప్రతి అమ్మాయి చూడాల్సిన మూవీ

OTT Movie : ఇద్దరు పిల్లల తల్లి కోసం రాబందుల్లా… ప్రతి అమ్మాయి చూడాల్సిన మూవీ
Advertisement

OTT Movie : ఓటిటిలో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తుంటారు ప్రేక్షకులు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఒక మంచి మెసేజ్ ను కూడా ఇస్తాయి. ఇటువంటి సినిమాలు మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక పేద మహిళ భర్తను పోగొట్టుకొని, పిల్లలతో జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టులా ఈదుతూ ఉంటుంది.  మనసుకు హత్తుకునే ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వేలితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

శక్తి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తూ ఉంటుంది. ఆమె భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారుతుంది. బతుకుదెరువు కోసం, ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది. ఆ పని చేసుకుంటూ కూడా పిల్లలకి రెండు పూటలా  తిండి పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు, అదే వీధిలో ఉండే విన్సెంట్ అనే వ్యక్తి, ఆమె ఎప్పుడు లొంగుతుందా అని గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ ఉంటాడు. అతను డబ్బులు వడ్డీకి ఇచ్చి మహిళలని వేధిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకరోజు శక్తి కొడుక్కి జ్వరం విపరీతంగా వస్తుంది. అందుకుగాను మరో దారి లేక విన్సెంట్ దగ్గర 3000 అప్పు తీసుకుంటుంది. ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలని ప్రయత్నిస్తుంది.

ఆయితే విన్సెంట్  మాత్రం ఆ డబ్బును తీసుకోకుండా, మనసులో పాడు బుద్ధి పెట్టుకుంటాడు. మరోవైపు పాచి పనులు చేసే ఇంటి ఓనర్, ఆమె డ్యూటీ కి సరిగ్గా రాలేదని జీతం కట్ చేసి ఇస్తుంది. తన కొడుక్కి బాగోలేదని చెప్పినా  వినిపించుకోదు. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలని బాధపడుతూ ఉంటుంది. ఆ జీతం ఇంటి అద్దె, పిల్లల తిండికి కూడా సరిపోదు. చివరికి శక్తి తను చేసిన అప్పు తిరిగి ఇస్తుందా ? విన్సెంట్ కి లొంగిపోతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : దెయ్యాల కొంపలో దడుచుకునే ఫ్యామిలీ… చెల్లి కోసం ఆత్మగా మారి…

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

 ఈ తమిళ మూవీ పేరు ‘కనల్’ (Kanal).  2022లో విడుదలైన ఈ మూవీకి టి . సమయ మురళి దర్శకత్వం వహించారు. ఒంటరి ఆడది సమాజంలో ఎదుర్కునే పరిస్థితులతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఒక వితంతువైన ఇద్దరు పిల్లల తల్లి చుట్టూ తిరుగుతుంది.  ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×