E-Paper
Advertisement

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?
Advertisement

OTT Movie : కన్నడ సినిమాలు ఈ మధ్య జోరు మీద ఉన్నాయి. కె జి యఫ్, కాంతారాలతో ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేశాయి. ఓటీటీలో వీటితో పాటు మిగతా సినిమాలను కూడా చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముందుగా హారర్ థ్రిల్లర్ పై మక్కువ చూపిస్తున్నారు.
రీసెంట్ గాథియేటర్లలో రిలీజ్ అయిన ‘కమరోట్టు 2’ హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇది 2019లో వచ్చిన ‘కమరొట్టు చెక్‌పోస్ట్’ సినిమాకు సీక్వెల్. అయితే దీనికి ఐఎండీబీలో 8 రేటింగ్ ఉండటం విశేషం. మొదటి పార్ట్ కంటే, సెకండ్ పార్ట్ లో హారర్ కంటెంట్ ఎక్కువే ఉండబోతోంది. ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

పరమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ హారర్ థ్రిల్లర్ ‘కమరోట్టు 2’ (Kamarottu 2)లో స్వామినాథన్ అనంతరామన్, రజనీ భరద్వాజ్, అనిల్ బాబీ, రక్షిత్ వంటి నటులు నటించారు. 2025 ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, నవంబర్ 7 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కి రాబోతోంది. ప్రస్తుతం కన్నడ భాషలోనే ఈ మూవీ అందుబాటులో ఉండబోతోంది.

Advertisement

Read Also : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

స్టోరీ ఏమిటంటే

న్యూఢిల్లీలో పారానార్మల్ రీసెర్చ్ సొసైటీలో పరిశోధకురాలిగా సారా అనే మహిళ పని చేస్తుంటుంది. ఆమె తన తప్పిపోయిన చెల్లెలు కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె తన సోదరిని వెతుక్కుంటూ కమరోట్టు అనే హాంటెడ్ ఇంటికి వస్తుంది. అక్కడ ఆమెకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆమె అతీత శక్తులతో ఫైట్ చేస్తుంది. మరో వైపు కొత్తగా పెళ్లయిన ఆర్య, స్వాతి అనే దంపతులు, ఆర్య తండ్రి కొనుగోలు చేసిన పురాతన ఇంట్లో సమయం గడపడానికి కమరోట్టుకు వస్తారు. మొదట అక్కడ ప్రశాంతంగా ఉన్నప్పటికీ, త్వరలోనే స్వాతి ఆ ఇంట్లో వింత సంఘటనలు ఎదుర్కొంటుంది. ఆర్య మొదట్లో ఆమె ఆందోళనలను కొట్టిపారేసినా, తరువాత అతనిని కూడా అతీత శక్తులు హంట్ చేస్తాయి. వీళ్ళంతా కలసి ఆ ఇంట్లో అసలు రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక క్లైమాక్స్ భయంకరంగా ముగుస్తుంది. చివరికి సారాకి తన సోదరి కనిపిస్తుందా ? కమరోట్టు ఇంటి రహస్యం ఏమిటి ? ఆర్య, స్వాతిల కథ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ కన్నడ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×