E-Paper
Advertisement

బిజీ మార్కెట్ లో మహిళ దారుణ హత్య… రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్

బిజీ మార్కెట్ లో మహిళ దారుణ హత్య… రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Kannada Murder Mystery Thriller: ఓటీటీల్లో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా సినిమాల ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ట్విస్టులు, టర్నులు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. అయితే అందులోనూ రా అండ్ రస్టిక్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఈరోజు మనం అలాంటి సినిమా గురించే మాట్లాడుకోబోతున్నాము. ఒకే హత్య… కానీ దాని వెనుక దాగి ఉన్న సత్యాలు ఏడు వేర్వేరు కోణాల్లో బయటపడతాయి. ఈ స్టోరీతో రూపొందిన సినిమానే కన్నడ సినిమా పరిశ్రమలో ఇటీవల వచ్చిన మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కమల్ శ్రీదేవి (Kamal Sridevi). మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ బెంగళూరులో రద్దీగా ఉండే ఓ మార్కెట్ ప్రాంతంలో మొదలవుతుంది. శ్రీదేవి అనే మహిళను అక్కడే అత్యంత దారుణంగా హత్య చేస్తారు. ఈ హత్య అన్నీ మర్డర్స్ లాంటి సాధారణ కేసు కాదు. ఎందుకంటే ఒకే సంఘటనను ఏడు విభిన్న కోణాల్లో చూపించే వినూత్నమైన నెరేటివ్ స్టైల్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. కమల్ అనే వ్యక్తి శ్రీదేవిని ఆ ప్రమాదం నుంచి కాపాడాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. కానీ అతను రంగంలోకి దిగి, ఆమెకు హెల్ప్ చేసేసరికి సమయం దాటిపోతుంది.

Advertisement

అంతలోనే శ్రీదేవి జీవితం విషాదాంతం అవుతుంది. ఇక ఇన్వెస్టిగేషన్ లో హత్య వెనుక ఉన్న కుట్రలు బయటకు వస్తాయి. సినిమా స్పెషాలిటీ ఏంటంటే… ఒక్కొక్కరు ఒక్కో నిజం చెప్తుంటారు. కొందరు ఆమెను కామం కోసం రేప్ చేసి చంపారని, మరికొందరు జీవనోపాధి కోసం డబ్బు ఆశతో చంపేశారని, ఇంకా కొందరు పాత శత్రుత్వాల వల్ల చంపారని చెప్తుంటారు. ఈ ఏడు కోణాలు కలిసి మూవీని ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుస్తాయి. ఇంతకీ ఆ శ్రీదేవి ఎవరు ? ఆమెను చంపింది ఎవరు ? ఆమె మృతి గురించి ఏడు కోణాల్లో చెప్పిన స్టోరీ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను తెరపై చూసి తీరాల్సిందే.

ఏ ఓటీటీలోకి వచ్చింది ?

ఈ సినిమాకు దర్శకుడు వి. ఎ. సునీల్ కుమార్ దర్శకత్వం వహించారు. సచిన్ చెలువరాయస్వామి, సంగీత భట్, కిషోర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో 7.8 రేటింగ్‌ సాధించిన ఈ మూవీ తాజాగానే ఓటీటీలోకి వచ్చింది. Sun NXTలో కన్నడ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం ఇంకా రాలేదు. కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడవచ్చు. ఏడు కోణాల్లో బయట పడే ఆ మైండ్ బ్లోయింగ్ స్టోరీ, ఆడియన్స్ మనసును కలచి వేస్తుంది.

Advertisement

Read Also: చావు అంటే భయపడే ప్రియుడికి విషమిచ్చి… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×