E-Paper
Advertisement

OTT Movie : మొదటి రాత్రే మొగుడు చనిపోతే… చిన్న వయసులో ఈ చిన్నారి ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్

OTT Movie : మొదటి రాత్రే మొగుడు చనిపోతే… చిన్న వయసులో ఈ చిన్నారి ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్
Advertisement

OTT Movie : ఒకప్పుడు పెళ్లిళ్లు చిన్న వయసులోనే జరిపేవారు. బాల్య వివాహాలు అప్పట్లో సాధారణంగా జరిగేవి. భర్తలు చనిపోతే ఆడవాళ్ళ పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది అది వేరే విషయం. అయితే 1940లో జరిగే ఒక ఫీల్ గుడ్ స్టోరీ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

జి ఫైవ్ (Zee5) లో

Advertisement

ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘కక్స్పర్ష్‘ (Kaksparsh). ఈ మూవీలో ఒక బ్రాహ్మణ కుటుంభంలో, చిన్న వయసులోనే ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారు. మొదటి రాత్రి గడవకముందే భర్త చనిపోతాడు. ఆ తర్వాత ఈమె పరిస్థితి ఏమిటి? అనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2012లో విడుదలైన ఈ మరాఠీ పీరియడిక్ డ్రామా మూవీకి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సచిన్ ఖేడేకర్, ప్రియా బాపట్, మేధా మంజ్రేకర్, సవితా మల్పేకర్, కేతకి మాతేగావ్కర్ నటించారు. ఈ మూవీ కమర్షియల్‌గా విజయవంతం అవ్వడంతో పాటు,  విమర్శకుల ప్రశంసలు పొందింది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హరినాథ్ ది ఒక బ్రాహ్మణ కుటుంబం. ఇతనికి మహదేవ్ అనే తమ్ముడు ఉంటాడు. ఉన్నత విద్య అభ్యసిస్తూ అన్నకు తోడుగా ఉంటాడు. అయితే తమ్ముడిని పెళ్లి చేసుకోవాల్సిందిగా అడుగుతాడు హరినాథ్. ఇంట్లో వదినకి సహాయం గా ఉంటుందని పెళ్లికి ఒప్పిస్తాడు. చిన్న వయసు అయిన ఉమతో పెళ్లి జరిపిస్తాడు. అయితే ఇంకా ఉమ చిన్న పిల్ల కావడంతో, మొదటి రాత్రికి సమయం తీసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో మహదేవ్ ఇష్టం లేకపోయినా, భార్యను వదిలి చదువుకోవడానికి పట్టణానికి వెళ్తాడు. ఇంట్లో సంతోషంగా ఉంటుంది ఉమా. కొద్దిరోజుల తర్వాత మహదేవ్ ఇంటికి వస్తాడు. మహదేవ్, ఉమకి మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయంలో తీవ్ర జ్వరంతో బాధపడతాడు మహదేవ్. డాక్టర్లు మందులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. మహదేవ్ అనారోగ్యంతో ఆ రాత్రి చనిపోతాడు.

భర్త చనిపోవడంతో ఉమా పరిస్థితి ఆ తర్వాత మారిపోతుంది. కొద్ది రోజుల్లోనే హరినాథ్ కి కూడా భార్య చనిపోతుంది.ఆ తరువాత అందరూ హరినాథ్ ని ఉమని పెళ్లి చేసుకోమంటారు. అందుకు హరినాథ్ ఒప్పుకోడు. ఒకరోజు భార్య భర్తలు ఎలా ఉంటారు తెలుసుకోవాలని ఉమ చాటుగా చూస్తుంది. ఇది గమనించిన హరినాథ్ ఆమెను గట్టిగా తిడతాడు. అప్పుడు ఉమ చాలా బాధపడుతుంది. నా భర్త ఉంటే అతనితో సంతోషంగా ఉండేదాన్ని కదా అనుకుంటుంది. ఆ దిగులుతో మంచం పడుతుంది. ఆ సమయంలో హరినాథ్ ఆమె మెడలో తాళి కట్టడానికి ఒప్పుకుంటాడు. చివరికి ఆమె మెడలో హరినాథ్ తాళి కడతాడా? ఉమ పరిస్థితి ఏమవుతుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మరాఠీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×