// // Thriller Series OTT : ఆత్మలతో మాట్లాడే డాక్టర్ ... ఓటీటీలోకి -->
E-Paper
Advertisement

Thriller Series OTT : ఆత్మలతో మాట్లాడే డాక్టర్ … ఓటీటీలోకి రాబోతున్న సౌత్ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

Thriller Series OTT : ఆత్మలతో మాట్లాడే డాక్టర్ … ఓటీటీలోకి రాబోతున్న సౌత్ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Thriller Series OTT : కొరియన్ సిరీస్ లకు మన వాళ్ళు ఫిదా అయిపోతున్నారు. కొత్త పాత అనే తేడా లేకుండా వీటిని తెగ చూస్తున్నారు. ఇక అక్కడ నుంచి రొమాంటిక్, థ్రిల్లర్ జోనర్లోనే ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక కొత్త మెడికల్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సిరీస్ పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. చనిపోయిన వారిని సైతం బ్రతికించగలననే నమ్మకంతో ఉండే ఒక న్యూరోసర్జన్ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘డాక్టర్ షిన్’ (Doctor Shin). ప్రధాన పాత్రల్లో జియాంగ్ యి-చాన్, బేక్ సో-రా నటించారు. ప్రముఖ రచయిత్రి ఫీబీ రాసిన మొదటి మెడికల్ థ్రిల్లర్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది 2026 మార్చి 14 నుంచి Chosun TV ఛానల్‌లో శని, ఆదివారాల్లో రాత్రి 10:30 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే Coupang Play ఓటీటీలో కూడా అందుబాటులో ఉంటుంది ఈ సిరీస్.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథలో హీరో డాక్టర్ షిన్ ఒక రేంజ్ న్యూరో సర్జన్. నేను తలుచుకుంటే చచ్చినోడిని కూడా బ్రతికిస్తా అనే రకం ఈ డాక్టర్ గారు. కట్ చేస్తే, ఒక ఊహించని యాక్సిడెంట్‌లో ఒక అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆమెను బ్రతికించడం కోసం ఈ డాక్టర్ గారు సైన్స్‌ని వాడి ఒక పిచ్చి ప్రయోగం చేస్తాడు. ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది కానీ, అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ అమ్మాయి ఒంట్లోకి వేరే ఆత్మ వచ్చి దూరినట్లు వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఇక మెయిన్ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో తల్లి, కూతుళ్ల మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది. ఒకరి మెదడు ఇంకొకరిలోకి మారడం, ఆ ప్రాసెస్‌లో వచ్చే గొడవలు సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషి శరీరంలో వేరే మనిషి బుర్ర ఉంటే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ఈ కథ సాగుతుంది. మొత్తానికి ఇది ఒక మాంచి మెడికల్ కిచిడీ, థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు.

Read Also : మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… స్టోరీ అంతా ఐఏఎస్ ల చుట్టూనే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×