E-Paper
Advertisement

OTT Movie : అమెజాన్‌ రివర్ లో అదిరిపోయే అడ్వెంచర్ … సీను సీనుకో ట్విస్ట్ తో మెంటలెక్కాల్సిందే

OTT Movie : అమెజాన్‌ రివర్ లో అదిరిపోయే అడ్వెంచర్ … సీను సీనుకో ట్విస్ట్ తో మెంటలెక్కాల్సిందే
Advertisement

OTT Movie : ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలను పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా వదిలిపెట్టకుండా చూస్తుంటారు. అందులోనూ హాలీవుడ్ సినిమాలలో అడ్వెంచర్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, ఒక పురాతన చెట్టు చుట్టూ తిరుగుతుంది. ఆ చెట్టు పువ్వులు ఏ రోగాన్ని అయినా నయం చేసే శక్తి ఉంటుంది. దీనిని కనిపెట్టే క్రమంలో ఎన్నో అడ్వెంచర్ సీన్స్ చూడవచ్చు. ఈ సినిమాలో డ్వేన్ జాన్సన్ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

Advertisement

ఈ అమెరికన్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ మూవీ పేరు ‘జంగిల్ క్రూయిజ్’ (Jungle Cruise). 2021 లో విడుదలైన ఈ మూవీకి జామ్ కొలెట్-సెర్రా దర్శకత్వం వహించారు. గ్లెన్ ఫికర్రా, జాన్ రెక్వా, మైఖేల్ గ్రీన్ స్క్రీన్ ప్లే అందించారు. దీనిలో డ్వేన్ జాన్సన్, ఎమిలీ బ్లంట్, ఎడ్గార్ రామిరెజ్, జాక్ వైట్‌హాల్, జెస్సీ ప్లెమన్స్, పాల్ జియామట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1916 సమయంలో అమెజాన్ నదిలో జరిగే ఒక సాహసయాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

పదహారవ శతాబ్దంలో స్పానిష్ రాజు నేతృత్వంలో ‘టియర్స్ ఆఫ్ ది మూన్’ అనే చెట్టును వెతకడానికి బయలుదేరుతారు కొంతమంది సైనికులు. ఈ చెట్టు పువ్వులు ఏ వ్యాధినైనా నయం చేసే శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. అయితే వారు ఈ ప్రయాణంలో, ఆ అడవిలో చిక్కుకుంటారు. స్తానికంగా ఉండే కొంత మంది వీరిని రక్షిస్తారు. కానీ తర్వాత వారు శాపానికి గురి అవుతారు. మూడు శతాబ్ధాల తరువాత 1916లో, బ్రిటిష్ కు చెందిన డాక్టర్ లిలీ హౌటన్ ఈ వృక్షాన్ని కనిపెట్టడానికి అమెజాన్‌కు వెళ్తుంది. ఎందుకంటే ఇది ఔషధ రంగంలో, విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని ఆమె నమ్ముతుంది. ఆమె తన సోదరుడు హౌటన్ తో కలిసి, ఫ్రాంక్ వోల్ఫ్ అనే సరదాగా ఉండే వ్యక్తి పడవలో ప్రయాణిస్తుంది. వాళ్ళు ఈ ప్రయాణంలో అమెజాన్ అడవిలోని సహజమైన ప్రమాదాలను ఎదుర్కుంటూ వెళతారు.

ఇంతలోనే జర్మన్ కి చెందిన కొంతమంది వీళ్ళను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు కూడా ఈ వృక్షాన్ని తమ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకోవాలని అనుకుంటారు. ఈ రెండు బృందాల మధ్య గట్టి పోటీనే ఉంటుంది. ఈ ప్రయాణంలో లిలీ, ఫ్రాంక్, మాక్‌గ్రెగర్ కలిసి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, టియర్స్ ఆఫ్ ది మూన్‌ను కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. చివరికి ఆ పురాతన చెట్టును వీళ్ళు కనిపెడతారా ? దాని పువ్వులను మంచికి ఉపయోగిస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : స్పృహలో లేని టీచర్ … ఆ పని చేస్తూ వీడియో… ఎవరుచేశారో తెలీకుండా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×