E-Paper
Advertisement

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు
Advertisement

OTT Movie : అలియా భట్ ప్రధన పాత్రలో నటించిన సినిమా ‘జిగ్రా’. ఈ సినిమాను దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. తన తమ్ముడిని విదేశీ జైలు నుంచి రక్షించేందుకు, ఓ అక్క చేసే పోరాటమే ఈ కథ. సినిమా మొత్తం అలియా భట్ చుట్టూనే తిరుగుతుంది. క్లైమాక్స్ వరకు ఊహించని మలుపులతో ఈ సినిమాల థ్రిల్లింగ్ ఛిల్ ని ఇస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘జిగ్రా’ 2024లో విడుదలైన హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, వాసన్ బాలా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటిస్తే, మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్, వివేక్ గోంబర్ సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. వయాకామ్18 స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షహీన్ భట్, సౌమెన్ మిశ్రా నిర్మించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 11న విజయదశమి సందర్భంగా థియేటర్లలో విడుదలై, 2024 డిసెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

Advertisement

ఈ సినిమా, సత్య ఆనంద్ (ఆలియా భట్), అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా) అనే సోదరి-సోదరుల కథతో మొదలవుతుంది. వీళ్ళు చిన్నతనంలోనే అనాథలుగా మారతారు. వీళ్ళ తండ్రి ఆత్మహత్య చేసుకున్న తర్వాత. సత్య ఒక ధైర్యవంతమైన సోదరిగా, తన తమ్ముడు అంకుర్‌ను ఎల్లప్పుడూ కాపాడుతూ, అతని అవసరాలను తీర్చడానికి తల్లిలా బాధ్యత తీసుకుంటుంది. వీళ్ళు దూరపు బంధువైన ఒక అంకుల్ దయపై ఆధారపడి పెరుగుతారు. కానీ కుటుంబ ఆలన లేకుండా ఒంటరిగా జీవిస్తారు. ఈ కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది.

అంకుర్ ఒక ఆసియా దేశం హన్షి దావోలో నార్కోటిక్స్ కేసులో తప్పుగా ఆరోపించబడి, మరణ శిక్షకు గురవుతాడు. ఈ దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. అంతే కాకుండా అంకుర్‌కు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంటుంది. సత్య తన తమ్ముడిని రక్షించడానికి ఏ విధమైన త్యాగానికైనా సిద్ధమవుతుంది. అతన్ని జైలు నుండి విడిపించే ఒక అసాధ్యమైన ప్లాన్ ను  వేస్తుంది. సత్య హన్షి దావోకు ప్రయాణిస్తుంది. అక్కడ ఆమె రిటైర్డ్ గ్యాంగ్‌స్టర్ షేఖర్ భాటియా, మాజీ పోలీసు అధికారి ముత్తు సహాయాన్ని పొందుతుంది.

Advertisement

షేఖర్ కొడుకు కూడా అదే జైలులో ఉంటాడు. ముత్తు తన గత తప్పిదాలకు పరిహారం చేయాలనుకుంటాడు. వీళ్ళు కలిసి ఒక అత్యంత పగడ్బంధీ జైలును భేదించే ప్లాన్ రూపొందిస్తారు. ఇది ఒక ద్వీపంలో ఉంది. దీనిని చేరడం, బయటకు రావడం దాదాపు అసాధ్యం.ఈ భాగంలో సత్య ఒక సామాన్య మహిళ నుండి ఒక యాక్షన్ హీరోగా మారుతుంది. సత్య చివరికి తన తమ్ముడిని విడిపిస్తుందా ? ఆమె కూడా జైలుకు వెళ్తుందా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×