E-Paper
Advertisement

OTT Movie : అలా చేస్తూ మనుషుల్ని చంపే అమ్మాయి… అబ్బబ్బా ఏం సినిమారా బాబూ ఇది!

OTT Movie : అలా చేస్తూ మనుషుల్ని చంపే అమ్మాయి… అబ్బబ్బా ఏం సినిమారా బాబూ ఇది!
Advertisement

OTT Movie : ప్రేమకథలకు హర్రర్ మిక్స్ చేస్తే ఇక చూడటానికి రెండు కళ్ళూ చాలవు. అందులోనూ ఈ కంటెంట్ తో వచ్చే హాలీవుడ్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, సైతాన్ పట్టిన ఒక అమ్మాయి..  పాడు పని చేస్తూ మనుషుల్ని చంపుతుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

జెన్నిఫర్ అనే హైస్కూల్ అమ్మాయి చాలా పాపులర్. ఆమెకు నీడీ అనే ఒక మంచి స్నేహితురాలు ఉంటుంది. ఒక రోజు రాత్రి, జెన్నిఫర్‌ను ఒక రాక్ బ్యాండ్ బృందం ఒక బార్‌ లో కలుస్తుంది. వారు ఆమెను సైతాన్ కి బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం నీడీ పసిగట్టి జెన్నిఫర్ ను హెచ్చరిస్తుంది. జెన్నిఫర్ ఆమె మాటలని పట్టించుకోకుండా వాళ్ళతో పాటూ వెళ్తుంది. అయితే ఆమెను బలి ఇవ్వాలి అనుకునేలోపు ఒక విషయం తెలుస్తుంది. జెన్నిఫర్ అప్పటికే కన్యత్వం కోల్పోయి ఉంటుంది. దీనివల్ల అక్కడ జరిగే తాంత్రిక పూజ వికటిస్తుంది. జెన్నిఫర్ ప్రాణాలతో బయటపడినా, ఆమెను సైతాన్ ఆవహిస్తుంది. ఇప్పుడు జెన్నిఫర్ తన అందంతో మగాళ్లను ఆకర్షించి, తనవైపు తిప్పుకుంటుంది. ఆ తరువాత శృంగారంలో పాల్గొంటూ ఆ వ్యక్తిని ఒక్కసారిగా చంపి తింటుంది. ఇలా రాత్రిపూట ఆమె కౌగిట్లో చిక్కుకుని చనిపోయే వ్యక్తులు చాలా మంది ఉంటారు.

జెన్నిఫర్ వింత ప్రవర్తనను ఆమె స్నేహితురాలు నీడీ  గమనించి, తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకుంటుంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ చిప్‌ తో కలిసి జెన్నిఫర్‌ ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయితే నీడీ బాయ్ ఫ్రెండ్ ని కూడా బుట్టలో వేసుకుని, చీకట్లో రెచ్చిపోదాం అంటూ మాయామాటలు చెప్తుంది. తన అందాన్ని చూపిస్తూ ముగ్గులోకి దింపుతుంది.

Advertisement

ఇక వీళ్ళిద్దరూ ఆట మొదలు పెట్టేలోగా, నీడీకి అనుమానం వచ్చి ఆక్కడికి వస్తుంది. చివరికి జెన్నిఫర్ నీడీ బాయ్ ఫ్రెండ్ తో పని కానిస్తుందా ? ఆమెలో ఉండే సైతాన్ ఎందుకు మనుషుల్ని చంపుకు తింటోంది ? దీనికి కారణమైన రాక్ బ్యాండ్ బృందంపై పగ తీర్చుకుంటుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : ఏజెంట్ ను చేస్తామని చెప్పి, సీక్రెట్ సర్వీస్ పేరుతో చేసే పని ఇదా?… మైండ్ బెండింగ్ స్పై థ్రిల్లర్

యూట్యూబ్ (youtube) లో

ఈ అమెరికన్ రొ*మాంటి*క్ హారర్ మూవీ పేరు ‘జెన్నిఫర్స్ బాడీ’ (Jennifer’s Body). 2009లో వచ్చిన ఈ మూవీకి కరీన్ కుసామా దర్శకత్వం వహించారు. ఇందులో మేగాన్ ఫాక్స్, అమండా సెయ్‌ఫ్రైడ్, జానీ సిమన్స్, J. K. సిమన్స్, అమీ సెడారిస్, ఆడమ్ బ్రాడీ నటించారు. ఇది ఒక టీనేజ్ అమ్మాయి జీవితంలో జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. జెన్నిఫర్స్ బాడీ 2009 సెప్టెంబర్ 10న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 2009 సెప్టెంబర్ 18న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడాలో థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×