E-Paper
Advertisement

Jab Khuli Kitaab OTT : 70 ఏళ్ల వయసులో విడాకుల కోసం… పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా రొమాంటిక్ కామెడీ ఓటీటీలోకి… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే?

Jab Khuli Kitaab OTT : 70 ఏళ్ల వయసులో విడాకుల కోసం… పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా రొమాంటిక్ కామెడీ ఓటీటీలోకి… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే?
Advertisement

Jab Khuli Kitaab OTT : ఓటీటీలో ఒక ఫ్యామిలీ డ్రామా ఆసక్తికరమైన కథనంతో ఆకట్టుకోబోతోంది. థియేటర్లకు వెళ్ళకుండా నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా, 50 ఏళ్లు కలిసి జీవితం పంచుకున్న ఒక వృద్ధ దంపతులు చుట్టూ తిరుగుతుంది. 70 ఏళ్ల వయసులో ఆ జంట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం పేరు ‘జబ్ ఖులీ కితాబ్’ (Jab Khuli Kitaab). సౌరభ్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జీ5 ( ZEE5) ఓటీటీ ప్లాట్ ఫామ్ లో 2026 మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం 2024 నవంబర్ 26న గోవాలో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) లో కూడా ప్రదర్శించబడింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గోపాల్ (పంకజ్ కపూర్), అనుసూయ (డింపుల్ కపాడియా) దంపతులు దాదాపు 50 ఏళ్లుగా కలిసి బతికారు. అందరి దృష్టిలో ఒక ఆదర్శ జంటగా పేరు కూడా తెచ్చుకున్నారు. కానీ సరిగ్గా వాళ్ళ పెళ్లి రోజు వేడుకల్లో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఒక పాత సీక్రెట్ బయటపడటంతో, 70 ఏళ్ల వయసులో తాము విడిపోవాలని, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయంతో పిల్లలతో పాటు, బంధువులు కూడా ఆశ్చర్యపోతారు. ఇక ఈ సినిమా అంతా ఈ వయసులో వాళ్ళు విడాకుల కోసం చేసే ప్రయత్నాలు, దాని చుట్టూ జరిగే సంఘటనలతో సాగుతుంది.

పెళ్లయిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఒకరి గురించి ఒకరికి తెలియని విషయాలు ఎలా బయటపడ్డాయి ? అసలు ఆ వయసులో వీళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సీక్రెట్స్ ఏమిటి ? చివరికి వీళ్ళు విడాకులు తీసుకున్నారా ? అనే విషయాలను, ఈ హిందీ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : కొడుకు కోసం మేకను బలి… మొక్కు తీర్చుకునేందుకు పేద రైతు అవస్థ… ఓటీటీలోకి తమిళ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×