E-Paper
Advertisement

Investigative Thriller OTT : స్నైపర్ షాట్స్‌కు బలయ్యే అమాయకులు… కిల్లర్ కిరాతకం… పోలీసుల అరాచకం

Investigative Thriller OTT : స్నైపర్ షాట్స్‌కు బలయ్యే అమాయకులు… కిల్లర్ కిరాతకం… పోలీసుల అరాచకం
Advertisement

Investigative Thriller OTT : పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఎక్కడ చూసినా, ఏ ఓటీడీలో చూసిన ఇలాంటి జోనర్ కే ఓటు వేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏకంగా 8 సీజన్లతో స్ట్రీమింగ్ అవుతోంది. తొమ్మిదో సీజన్ కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పోలీస్ ప్రొసీడ్యూరల్ లవర్స్‌కు సూపర్ ఎంటర్‌టైనింగ్. ఎప్పుడూ బోర్ కొట్టదు. ఒకసారి స్టార్ట్ చేస్తే స్టాప్ చేయలేం కూడా. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అంటే ?

2018లో వచ్చిన ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ పేరు ‘FBI’. ఇది డిక్ వోల్ఫ్, క్రెయిగ్ టర్క్ సృష్టించిన ఒక క్రైమ్ సిరీస్. 2018 సెప్టెంబర్ 25న CBS నెట్‌వర్క్‌లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు ఆడియన్స్ ని అలరించాయి. తొమ్మిదవ సీజన్ కూడా ఈ ఏడాది రాబోతోంది. ఈ సిరీస్ అన్ని సీజన్లు Paramount+ లో అందుబాటులో ఉన్నాయి. మీరు Amazon Prime Video, Apple TVలో కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇందులో మిస్సీ పెరెగ్రిమ్ (స్పెషల్ ఏజెంట్ మాగీ బెల్), జీకో జాకీ (స్పెషల్ ఏజెంట్ ఒమర్ అడమ్ “OA” జిదాన్), జెరెమీ సిస్టో (జుబల్ వాలెంటైన్) అలనా డి లా గార్జా (ఐసోబెల్ కాస్టిల్) వంటి నటులు నటించారు. దీనిని వోల్ఫ్ ఎంటర్టైన్మెంట్, CBS స్టూడియోస్ కలసి నిర్మించాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సిరీస్ న్యూయార్క్‌లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)ఆఫీసులోని ఏజెంట్ల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు తీవ్రవాదం, సహా అనేక క్లిష్టమైన కేసులను డీల్ చేస్తుంటారు. మాగీ బెల్ అనే స్పెషల్ ఏజెంట్, ఆమె పార్టనర్ జిదాన్ అనే ఏజెంట్ అక్కడ టాప్ ఏజెంట్స్. మాగీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇందులో ఆమె తన భర్తను లాస్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. జస్టిస్ కోసం ఫుల్ డెడికేటెడ్ గా ఉంటుంది. వీళ్ళు ఎన్నో అండర్‌కవర్ అపరేషన్స్ చేయడంతో చాలా కాన్ఫిడెంట్ తో ఉంటారు. వీళ్ల టీమ్ లీడ్ చేసేది జుబల్ వాలెంటైన్. ఆఫీస్ లో అందరినీ ఎప్పుడూ మోటివేట్ చేస్తాడు, ఆర్డర్స్ ఇస్తుంటాడు.

తర్వాత సీజన్స్‌లో ఇసోబెల్ కాస్టిల్లే జాయిన్ అవుతుంది. టిఫనీ, స్కోలా లాంటి క్యారెక్టర్స్ కూడా వస్తారు. ప్రతి ఎపిసోడ్‌లో ఒక బిగ్ కేస్ – బాంబ్ బ్లాస్ట్స్, టెర్రర్ ప్లాట్స్, సీరియల్ కిల్లర్స్, గ్యాంగ్ వార్స్, పాయిజన్ అటాక్స్, హ్యూమన్ ట్రాఫిక్కింగ్ లాంటివి వస్తుంటాయి. టీమ్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఫీల్డ్ వర్క్ ఉపయోగించి కేసులు సాల్వ్ చేస్తుంది. ఇందులో రియలిస్టిక్ FBI ప్రొసీజర్స్ చూపిస్తారు. ఏజెంట్స్ పర్సనల్ లైఫ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా మిక్స్ అవుతాయి. టెర్రరిజం, క్రైమ్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ ఎక్కుగా ఉంటుంది.

Advertisement

Read Also :  అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి… కూర వండుకుని తినే సైకో… గూస్ బంప్స్ పక్కా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×