E-Paper
Advertisement

పరిచయం ప్రేమ లేదు… ఆ ఇద్దరూ చేసేది ఆ పనులే… అన్నీ అలాంటి సీన్లే

పరిచయం ప్రేమ లేదు… ఆ ఇద్దరూ చేసేది ఆ పనులే… అన్నీ అలాంటి సీన్లే
Advertisement

Romantic Movie OTT : ఇది వరకు పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే అదో రకంగా చూసే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఓటీటీల పుణ్యమా అని అలాంటి సినిమాలను చూసే వారికి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. తమ అభిరుచి మేరకే ఎలాంటి మొహమాటం లేకుండా అలాంటి సినిమాలను కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది. అలాంటి మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

ఆపిల్ టీవీలో అందుబాటులో

ఈ మూవీ పేరు ‘Intimacy’ (2001). ఈ సినిమా ఇండియాలోని ఓటీటీలలో నేరుగా అందుబాటులో లేదు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇది చాలా పాత సినిమా కావడంతో కొన్ని విదేశీ సైట్లలో అంటే MUBI వంటి సైట్లలో అందుబాటులో ఉంది. Apple TV లోనూ రెంట్‌కి దొరికే అవకాశం ఉంది. యూట్యూబ్‌లో కూడా చూడవచ్చు.కానీ కొన్ని క్లిప్పింగ్స్ లేదా ట్రైలర్లు మాత్రమే కనిపిస్తాయి, యూట్యూబ్ లో పూర్తి సినిమా అందుబాటులో లేదు. ఒకవేళ పూర్తి సినిమా చూడాలంటే థర్డ్ పార్టీ క్లాసిక్ మూవీ వెబ్‌సైట్ల మీద ఆధారపడాల్సిందే అని గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు గ్రాఫిక్స్ కానే కావు.

Advertisement

పైగా అన్నీ రియల్‌గా షూట్ చేసినవట. అందుకే దీనికి చాలా దేశాల్లో సెన్సార్ కత్తెర వేసింది. ఈ సినిమాను హనీఫ్ కురైషీ రాసిన కథల ఆధారంగా తీయగా, బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ బేర్ (Golden Bear) అనే అవార్డును కూడా గెలుచుకుంది. కేవలం మజా కోసం మాత్రమే కాకుండా, మనుషుల మధ్య ఉండే ఒంటరితనాన్ని, వెలితిని ఈ సినిమా చాలా రాగా చూపించారు మేకర్స్. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీకెండ్ ఒక లుక్కేయండి.

Also Read : గ్యాంగ్‌స్టర్ల రేంజ్‌లో కొట్టుకునే అక్కాచెల్లెళ్ళు… సన్యా మల్హోత్రా ఇలాంటి సినిమా చేసిందా ?

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ మూవీ కథ జే (Jay) అనే ఒక బార్ టెండర్ ది. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఒంటరిగా బతుకుతాడు అతను. అలాంటి వాడి దగ్గరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒక అజ్ఞాత అమ్మాయి వస్తుంది. వాళ్లిద్దరూ ఒకరికొకరు అస్సలు తెలియదు. కనీసం పేర్లు కూడా చెప్పుకోరు. మాటలు అంతకన్నా ఉండవు.. రావడం, కలవడం, వెళ్ళిపోవడం ఇదే పని. కానీ ఈ నేపథ్యంలోనే ఓరోజు జేకి ఆమె ఎవరో తెలుసుకోవాలనే పిచ్చి కుతూహలం మొదలవుతుంది.

అందులో భాగంగానే ఆమె వెనకాలే వెళ్లి ఆరా తీస్తాడు. అయితే ఆమెకు ఒక మొగుడు, కొడుకు ఉన్నారని తెలుసుకుంటాడు. అంతేకాదు ఆమె ఒక థియేటర్ ఆర్టిస్ట్ కూడా అనే విషయం బయట పడుతుంది. ఈ క్రమంలో వాళ్ల మధ్య ఉన్న ఆ ‘కేవలం శారీరక బంధం’ కాస్తా ఎమోషనల్ రచ్చగా మారుతుంది. మరి ఈ డీప్ ఎమోషనల్ బాండింగ్ చివరికి ఇద్దరి జీవితాల్లో ఎలాంటి గందరగోళం సృష్టించింది ? అనేదే మూవీ క్లైమాక్స్.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×