E-Paper
Advertisement

OTT Movie : బీచ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్… రెండుసార్లు జైలు నుంచి బికినీ కిల్లర్ ఎస్కేప్… పోలీసులు ఇచ్చే షాక్ కు మైండ్ బ్లా

OTT Movie : బీచ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్… రెండుసార్లు జైలు నుంచి బికినీ కిల్లర్ ఎస్కేప్… పోలీసులు ఇచ్చే షాక్ కు మైండ్ బ్లా
Advertisement

OTT Movie : రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక నిజమైన ముంబై పోలీసు ఆఫీసర్ మధుకర్ జెండే, సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ్‌రాజ్‌ను రెండుసార్లు అరెస్ట్ చేసిన కథ నుండి స్ఫూర్తి పొందింది. ఇందులో ఇన్‌స్పెక్టర్ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ అద్భుతంగా నటించాడు. 32 హత్యలు చేసిన కిల్లర్ ని పట్టుకోవడానికి ఇన్‌స్పెక్టర్ చేసే ప్రయత్నంతో ఈ స్టోరీ నడుస్తుంది. దీనిపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

కథలోకి వెళ్తే

1971లో ముంబైలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ మధుకర్ జెండే (మనోజ్ బాజ్‌పాయ్) ఒక చిన్న దొంగగా ఉన్న కార్ల్ భోజ్‌రాజ్ ను తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో ఒక దోపిడీ ప్రయత్నంలో పట్టుకుంటాడు. కార్ల్ ఐదుగురు సహచరులతో కలిసి న్యూ ఇండియా అస్యూరెన్స్ బిల్డింగ్‌ను దోచాలని ప్లాన్ చేస్తాడు. కానీ జెండే ఒక దొంగ నుంచి సమాచారం పొంది అతన్ని అరెస్ట్ చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కార్ల్ బీచ్ లో ఉండే స్విమ్‌సూట్ వేసుకున్న అమ్మాయిలను దారుణంగా చంపుతుండేవాడు. ఇప్పుడు 32 హత్యలు చేసిన “స్విమ్‌సూట్ కిల్లర్”గా మారి, తీహార్ జైలు నుంచి తన సహచరులతో తప్పించుకుంటాడు. మహారాష్ట్ర DGP చంద్రకాంత్ పురందరే (సచిన్ ఖేడేకర్) ఈ కేసును జెండేకు అప్పగిస్తాడు. ఎందుకంటే అతను కార్ల్‌ను గతంలో పట్టుకున్నాడు. జెండే, తన టీమ్ పాటిల్, జాకబ్, దేశ్‌మనే, నాయక్ , పటేకర్ తో కలిసి కార్ల్‌ను వెంబడిస్తాడు.

Advertisement

కార్ల్ గోవాలోని ఓ’కోక్వీరో రెస్టారెంట్‌లో ఉండొచ్చని జెండే కి సమాచారం అందుతుంది. అక్కడ అతన్ని పట్టుకోవడానికి టూరిస్ట్‌గా మారువేషంలో వేచి ఉంటాడు. 1986 ఏప్రిల్ 6న కార్ల్‌ను చూసిన జెండే, “హాయ్, కార్ల్. హౌ ఆర్ యూ?” అని చలాకీగా అడిగి అతన్ని అరెస్ట్ చేస్తాడు. కానీ కార్ల్ ఆయుధం తీయడానికి ప్రయత్నిస్తాడు. ఒక వింతైన క్లబ్ ఫైట్ సీన్‌లో, జెండే, కార్ల్ ను ఓడిస్తాడు. అతన్ని “జస్ట్ మ్యారీడ్” కారులో అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇలా ఎండ్ అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ఇన్‌స్పెక్టర్ జెండే’ (Inspector Zende) 2025లో విడుదలైన హిందీ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వంలో మనోజ్ బాజ్‌పాయ్ (ఇన్‌స్పెక్టర్ మధుకర్ జెండే), జిమ్ సర్బ్ (కార్ల్ భోజ్‌రాజ్), సచిన్ ఖేడేకర్ (DGP చంద్రకాంత్ పురందరే), గిరిజా ఓక్ (విజయ జెండే) ప్రధాన పాత్రల్లో నటించారు. ఓం రౌత్, జయ్ శేవక్రమణి నిర్మించిన ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై హిందీ, తమిళం, తెలుగు ఆడియోలతో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 51 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.8/10 రేటింగ్ పొందింది.

Advertisement

Read Also :  30 ఏళ్ల మహిళను పట్టుకుని పాడు పని… పిల్లలు పుట్టట్లేదని వెళ్తే ఇదెక్కడి దిక్కుమాలిన ట్రీట్మెంట్ సామీ ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×