E-Paper
Advertisement

18 ఎపిసోడ్ల ఖతర్నాక్ క్రైమ్ సిరీస్ భయ్యా… రిలీజైన గంటల్లోనే ట్రెండింగ్ లో

18 ఎపిసోడ్ల ఖతర్నాక్ క్రైమ్ సిరీస్ భయ్యా… రిలీజైన గంటల్లోనే ట్రెండింగ్ లో
Advertisement

Action Thriller Series OTT : ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమాలు లేదా సిరీస్ లు విడుదల అవుతూనే ఉంటాయి. కానీ అందులో మోస్ట్ అవెయిటింగ్ మాత్రం కొన్నే ఉంటాయి. అయితే మరికొన్ని సిరీస్ లు సడన్ గా ఊడిపడడమే కాకుండా, ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై ట్రెండింగ్ లో నిలుస్తాయి. తాజాగా అలాంటి సిరీస్ ఒకటి ఓటీటీని ఊపేస్తోంది. మరి ఆ సిరీస్ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ కథ మొత్తం ఒక కఠినమైన పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. 90వ దశకంలో ఉత్తర ప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2021లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సిరీస్ మొదటి భాగం ఓటీటీలో అద్భుతంగా రాణించింది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత 2026లో వచ్చిన రెండవ భాగం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చిన ఆ సిరీస్ మరేదో కాదు, ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ సీజన్ 2 (Inspector Avinash Season 2). రణదీప్ హూడా మరోసారి ఇన్‌స్పెక్టర్ అవినాష్‌ గా ఈ సిరీస్ సీక్వెల్ లో రీఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇందులో అవినాష్ మిశ్రా పాత్రకు జీవం పోశారని చెప్పాలి. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ (Jiohotstar) ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

ట్రెండింగ్‌ లో ఉన్న సిరీస్

Advertisement

‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ సిరీస్ రెండవ సీజన్‌ లో ఎనిమిది ఎపిసోడ్‌ లు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ విడుదలైన గంటల వ్యవధిలోనే ఓటీటీని ఊపేస్తోంది. అంతేకాదు ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌ లో, హిందీ సిరీస్ లలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌ లో ఉంది. హిందీతో సహా ఏడు భాషలలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ కి సెన్సార్ బోర్డ్ నుండి ‘A’ సర్టిఫికేట్ రావడం గమనార్హం. IMDbలో 7.6 రేటింగ్ ఉండడం విశేషం.

Also Read : తోడేలుగా మారిన అక్కను కాపాడుకునేందుకు పోరాడే చెల్లి… ఓటీటీలో వణికిస్తున్న మూవీ

‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ కథ ఏంటంటే ?

Advertisement

‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ సిరీస్ కథ 90వ దశకంలో సాగుతుంది. నేరాలు విపరీతంగా పెరిగిపోయిన ఉత్తర ప్రదేశ్ నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. ఇన్‌స్పెక్టర్ అవినాష్, అమిత్ సియాల్, అభిమన్యు సింగ్‌ వంటి విలన్ లను తన స్టైల్ లో ఎదుర్కొంటాడు. మరి ఆయన ఆ కేసులను ఎలా ఫేస్ చేశాడు ? అన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలు, సిరీస్‌ లు చూడటానికి ఇష్టపడే వారికి, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ ను ఆస్వాదించే వారైతే ఇదే బెస్ట్ సిరీస్. ఈ వీకెండ్ లో చూడడానికి ఇది బెస్ట్ సిరీస్. డోంట్ మిస్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×