E-Paper
Advertisement

మతగురువు నుండి మాఫియా నాయకుడి దగ్గరకు… థియేటర్లలో జనాలు లేక ఓటీటీలోకి మూవీ

మతగురువు నుండి మాఫియా నాయకుడి దగ్గరకు… థియేటర్లలో జనాలు లేక ఓటీటీలోకి మూవీ
Advertisement

Hollywood Crime Thriller : అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు కమర్షియల్‌ గా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదు. తాజాగా ఆ జాబితాలో చేరింది హాలీవుడ్ సస్పెన్స్ క్రైమ్ డ్రామా ‘ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డాంటే’ (In the Hand of Dante). ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన సినిమా. కేవలం విడుదలైన 12 రోజుల్లోనే డిజిటల్ స్క్రీన్స్‌ పైకి వచ్చేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.

లీకేజీల దెబ్బ… బాక్సాఫీస్ పరాజయం

గతేడాది సెప్టెంబర్ 3న జరిగిన ప్రతిష్టాత్మక 82వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (Venice International Film Festival) ఈ చిత్రాన్ని పోటీయేతర విభాగంలో ప్రదర్శించగా, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అయితే దాదాపు తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది జూన్ 12న అమెరికాలో థియేటర్లలో విడుదలైంది. దురదృష్టవశాత్తూ, విడుదలకు ముందే ఈ సినిమా ఆన్‌లైన్‌ లో లీక్ కావడం దీని కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. మిశ్రమ విమర్శలు, థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గక తప్పలేదు.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Advertisement

థియేట్రికల్ రన్‌ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, ఈ చిత్రానికి డిజిటల్ ఆడియన్స్‌ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్నాళ్లూ సస్పెన్స్‌ గా ఉన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు క్లియర్ అయింది. ఈ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 24 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. హోమ్ థియేటర్లలో ఈ ఇంటర్నేషనల్ డ్రామాను చూసేందుకు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కథలోకి వెళ్తే…

డాంటే అలిఘేరి రాసిన ప్రపంచ ప్రసిద్ధ కవితా సంకలనం “ది డివైన్ కామెడీ”. దీనికి సంబంధించిన ఒక అత్యంత అరుదైన ఒరిజినల్ చేతివ్రాత ప్రతి న్యూయార్క్ నగరంలోని ఒక బ్లాక్ మార్కెట్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశిస్తుంది. చర్చికి చెందిన ఒక మతగురువు నుండి ఈ పురాతన ప్రతి, నగరంలోని అత్యంత ప్రమాదకరమైన ఒక మాఫియా ముఠా నాయకుడి చేతుల్లోకి వెళ్తుంది. ఆ చేతివ్రాత అసలైనదేనా కాదా అని నిర్ధారించడానికి, నిక్ టోషెస్ అనే నిపుణుడిని రంగంలోకి దింపుతారు.

Advertisement

అయితే, ఆ అమూల్యమైన చారిత్రక సంపదను మాఫియా నుండి కాపాడి, దాన్ని తన హస్తగతం చేసుకోవడానికి నిక్ ఎలాంటి వ్యూహాలు పన్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన ప్రాణసంకట పరిస్థితులు ఏంటి? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కథ సాగుతుంది. కథతో పాటు ఈ చిత్రంలోని భారీ కాస్టింగ్ సినిమాపై అంచనాలను పెంచింది. ‘మూన్ నైట్’ ఫేమ్ ఆస్కార్ ఐజాక్, గ్లోబల్ స్టార్ గాల్ గాడోట్ (వండర్ వుమన్), యాక్షన్ హీరో గెరార్డ్ బట్లర్, సీనియర్ నటుడు జాన్ మల్కోవిచ్ ఇందులో ప్రధాన పాత్రలలో నటించారు. లూయిస్ కాన్సెల్మి, సబ్రినా ఇంపచియాటోర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read Also : చిన్న పిల్లలను టార్గెట్ చేసే సైకో… నరాలు కట్టయ్యే థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×