E-Paper
Advertisement

ఊళ్ళో చర్మం లేకుండా పుట్టే పిల్లలు… తల్లిదండ్రులే చంపి ఇదేం దారుణం భయ్యా ?

ఊళ్ళో చర్మం లేకుండా పుట్టే పిల్లలు… తల్లిదండ్రులే చంపి ఇదేం దారుణం భయ్యా ?
Advertisement

Horror Movie OTT : సాధారణంగా హర్రర్ సినిమాలంటే గుండెల్లో గుబులు రేపేలా ఉంటాయి. కానీ ఇండొనేషియన్ హర్రర్ సినిమాలు మాత్రం చాలా ప్రత్యేకం. కల్లోనూ వెంటాడే భయంకరమైన సీన్లతో అచ్చమైన హర్రర్ థ్రిల్లర్స్ అన్పించేలా ఉంటాయి. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Advertisement

పాపులర్ ఇండోనేషియా దర్శకుడు జోకో అన్వర్ రూపొందించిన ఒక అద్భుతమైన చిత్రం Impetigore. 2019లో విడుదలైన ఈ అత్యంత భయంకరమైన మిస్టికల్ ఫోక్-హారర్ థ్రిల్లర్ చిత్రంలో ఒకప్పటి గ్రామీణ సంస్కృతి, మూఢనమ్మకాలు, వింత శాపం చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ మైండ్-బ్లోయింగ్ ఫోక్ హారర్ చిత్రం ఇప్పుడు ఇండియాలో Amazon Prime Video ఓటీటీలో అందుబాటులో ఉంది

కథలోకి వెళ్తే…

Advertisement

జకార్తా నగరంలో కథ నడుస్తుంది. మాయ టోల్‌ బూత్ కలెక్టర్‌ గా పని చేస్తుంది. ఆమెపై ఒక రోజు రాత్రి ఒక వ్యక్తి కత్తితో దాడి చేస్తాడు. అతను ఆమెను ‘రహయు’ అని పిలుస్తాడు. ఆమె పుట్టిన గ్రామం ‘హర్జోసారి’నికి చెందిన వాడినని వెల్లడిస్తాడు. అయినప్పటికీ ఆ దాడి నుండి తృటిలో తప్పించుకుంటుంది మాయ. పాత ఫ్యామిలీ ఫోటో ఆధారంగా తమకు ఒక మారుమూల గ్రామంలో పెద్ద ఇల్లు ఉందని తెలుసుకుంటుంది. ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి ఆస్తిని అమ్మి వ్యాపారం పెట్టాలని ఆశ పడుతుంది ఆ అమ్మాయి. మాయ తన బెస్ట్ ఫ్రెండ్ ని తీసుకుని ఊరికి బయలుదేరుతుంది.

Also Read : యుద్ధం అంటేనే భయం పుట్టించే సినిమాలు… వీటిని చూశాక మాటలు ఉండవు

అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఊహించని ట్విస్ట్ బయట పడుతుంది. అందులో మాయ చర్మం లేకుండానే పుట్టింది అని తెలుస్తుంది. కూతురును బతికించుకోవడానికి ఆమె తండ్రి ఒక దుష్టశక్తితో డీల్ చేసుకుంటాడు. ఊరిలో ముగ్గురు చిన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణమైన పని చేస్తాడు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊరికి ఊహించని శాపం ఇస్తారు. మాయ ఊర్లోకి వెళ్ళిందని తెలుసుకుని, ఆ గ్రామస్తులు అంతా ఆమెను పట్టుకుని బలి ఇవ్వాలని ట్రై చేస్తారు. అసలు మాయకు ఆ శాపంతో ఉన్న సంబంధం ఏంటి ? చివరకు ఆ ఊరి నుంచి ఎలా బయట పడింది ? అసలు ఆమె క్లైమాక్స్ లో బతికి బయట పడిందా ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×