E-Paper
Advertisement

Hot Spot 2 Much OTT : ప్లాప్ సినిమా స్ట్రీమింగ్ లో మెంటల్ మాస్ ట్విస్ట్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Hot Spot 2 Much OTT : ప్లాప్ సినిమా స్ట్రీమింగ్ లో మెంటల్ మాస్ ట్విస్ట్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Advertisement

Hot Spot 2 Much OTT : విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘హాట్ స్పాట్ 2 మచ్’ (Hot Spot 2 Much). ఇది 2024లో విడుదలైన ‘హాట్ స్పాట్’ కి సీక్వెల్ గా వచ్చింది. థియేటర్లలో విడుదలైన సమయంలో అంత ఆదరణ లభించకపోయినా, ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ గా సెన్సేషన్ అవుతోంది. ఎందుకంటే ఈ సినిమా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆరు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ కాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ అంటే

‘హాట్ స్పాట్ 2 మచ్’ విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో 2026 జనవరి 23న విడుదలైన ఒక హైపర్ లింక్ డ్రామా. ఇందులో ప్రియా భవానీ శంకర్, MS బాస్కర్, తంబి రామయ్య, రక్షణ, అశ్విన్ కుమార్, ఆదిత్య బాస్కర్, భవాని శ్రీ నటించారు. దీనిని కెజెబి టాకీస్, యాంట్స్ టు ఎలిఫెంట్స్ నిర్మించారు. ఇది ఆరు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో 2026 ఫిబ్రవరి 20న ప్రీమియర్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, లయన్స్‌గేట్ ప్లే, సింప్లీ సౌత్, AP ఇంటర్నేషనల్ సౌత్ సినిమా, షార్ట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా కథ ఒక దర్శకురాలు (ప్రియా భవానీ శంకర్) ఒక నిర్మాతకు మూడు వేర్వేరు కథలను వినిపించే నేపథ్యంలో సాగుతుంది. మొదటి కథలో హీరోల మీద ఉండే మితిమీరిన అభిమానం (Toxic Fan Culture) వల్ల వచ్చే సమస్యలను చూపించారు. రెండో కథలో ఆడవాళ్ళ బట్టల మీద సమాజం చేసే కామెంట్స్, వాటి వెనక ఉండే రాజకీయాల గురించి చూపించారు. ఇక మూడో కథలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని వాడుకుని, నేటి తరం ప్రేమ బంధాలను వినోదాత్మకంగా, కాస్త ఘాటుగా చూపించడం జరిగింది. దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ సమాజంలో మనం బయటికి చెప్పుకోలేని కొన్ని సున్నితమైన విషయాలను ఈ మూడు కథల ద్వారా చాలా బోల్డ్‌గా చూపించారు. ప్రతి కథలోనూ ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. సమాజం మార్చుకోవాల్సిన పద్ధతులను ఈ ‘హాట్ స్పాట్ 2 మచ్’ మన ముందుకు తీసుకొచ్చింది.

Read Also : ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×