E-Paper
Advertisement

వింత శబ్దాలతో వణికిపోయే ఫ్యామిలీ… దేవుడు కూడా కాపాడలేని దారుణాలు… ఇదొక మాయదారి విచిత్రం

వింత శబ్దాలతో వణికిపోయే ఫ్యామిలీ… దేవుడు కూడా కాపాడలేని దారుణాలు… ఇదొక మాయదారి విచిత్రం
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలో ఒక డిఫరెంట్ కంటెంట్ తో ఒక సైకలాజికల్ హారర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 18 వ శతాబ్ధంలో సాగే ఈ కథ తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, నటీనటుల నటన, ఇందులో అడవిని చూపించిన విధానం సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా దైవ భక్తికి, పిచ్చికి మధ్య ఉండే తేడాని ఈ చిత్రం ఆసక్తికరంగా చూపిస్తుంది. మూఢనమ్మకాలు ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాయనే పాయింట్‌ను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ సినిమాలో ‘శబ్దం’ (Sound) ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో వినిపించే ఆ వింత శబ్దం ప్రేక్షకులకు భయాన్ని కలిగించేలా బాగానే డిజైన్ చేశారు. హారర్ ఫ్యాన్స్ ఓ సారి చూడాల్సిన సినిమా ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సూపర్‌నేచురల్ హారర్ సినిమా పేరు Thine Ears Shall Bleed. బెన్ బిగెలో దీనికి దర్శకత్వం వహించారు. ఇది ఆయనకు మొదటి సినిమా కూడా. ఈయన తన తండ్రి విలియం బిగెలోతో కలిసి ఈ కథను రాయడం జరిగింది. ఇందులో ఆండ్రూ హోవెల్సన్, హన్నా కాబెల్, లీ జవాడా లీడ్ రోల్స్ లో నటించారు. ఇది ఒక లో బడ్జెట్ సినిమా. తక్కువ ఖర్చుతో నిర్మించినా, అందులోని థ్రిల్, విజువల్స్ బాగుంటాయి. సినిమా సుమారు 1 గంట 45 నిమిషాల పాటు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. 2024 జూలైలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1860వ కాలంలో ఒక చర్చి ఫాదర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అడవి మార్గంలో ప్రయాణిస్తుంటాడు. చర్చి కోసం ఒక మ్యూజిక్ ఆర్గాన్‌ను తీసుకురావడానికి వెళ్తుండగా, పొరపాటున దారి తప్పి ఒక వింతైన, నిర్మానుష్యమైన అడవిలో చిక్కుకుపోతారు. అక్కడ వాళ్ళ గుర్రాలు కూడా మాయమవ్వడంతో, ఆ కుటుంబం బయటపడలేక అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కొంచెం సేపటి తరువాత ఆ అడవిలో ఒక వింతైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని విన్న చర్చి ఫాదర్, అది దేవుడి గొంతు అని బలంగా నమ్ముతాడు. ఆ శబ్దం పట్ల విపరీతమైన భక్తిని పెంచుకుని, తనని తాను హింసించుకోవడం మొదలుపెడతాడు. అతనితో పాటు అతని కొడుకు కూడా ఆ శబ్దానికి బానిసవుతాడు.

కానీ అది విన్నప్పుడల్లా వాళ్ళ చెవుల నుండి రక్తం కారడం గమనించిన భార్య, కూతురు భయాందోళనకు గురవుతారు. అయితే ఆ శబ్దం దైవంది కాదని, అది మనుషులను బలి తీసుకునే ఒక దుష్ట శక్తి అని ఆ కుటుంబంలోని స్త్రీలు గ్రహిస్తారు. మతం పేరుతో పిచ్చిగా ప్రవర్తిస్తున్న భర్తను, కొడుకును ఆ ప్రమాదం నుండి కాపాడుకోవడానికి ఆ స్త్రీలు విశ్వ ప్రయత్నం చేస్తారు. చివరికి ఆ మాయా శబ్దం నుండి వాళ్ళంతా ప్రాణాలతో బయట పడ్డారా ? అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది ? ఎందుకు వస్తోంది ? దీని క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఇంట్లో ఇల్లాలు ఆఫీస్ లో ప్రియురాలు… మైండ్ బెండింగ్ ట్విస్టులతో అదరగొడుతున్న సిరీస్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×