E-Paper
Advertisement

Horror Thriller OTT: వ్యూస్ కోసం ఉత్తుత్తి దెయ్యాలతో లైవ్ షో… సీన్ లోకి చెమట్లు పట్టించే రియల్ ఘోస్ట్… వణికిస్తున్న హారర్

Horror Thriller OTT: వ్యూస్ కోసం ఉత్తుత్తి దెయ్యాలతో లైవ్ షో… సీన్ లోకి చెమట్లు పట్టించే రియల్ ఘోస్ట్… వణికిస్తున్న హారర్
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలో హారర్ సినిమాలకు కొదవ లేదు. ఎన్నో భయపెట్టే సినిమాలు స్ట్రీమింగ్ లో ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో వ్యూస్ కోసం, లైకుల కోసం జనాలు ఎంత దిగజారుతున్నారో, ఎన్ని దారుణాలకు తెగబడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ పాయింట్ మీద తక్కువ బడ్జెట్‌తో తీసిన ఒక సినిమా, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతోంది. ఈ సినిమాకు హారర్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్, మేకప్ గురించి విమర్శకులు మెచ్చుకున్నారు కూడా.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది క్లెన్సింగ్ అవర్’. డామియన్ లెవెక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథ ఇద్దరు స్నేహితులు మాక్స్ (రయాన్ గుజ్మాన్) డ్రూ (కైల్ గాల్నర్) చుట్టూ తిరుగుతుంది. 1 గంట 34 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2019 సెప్టెంబర్ 18న రిలీజ్ అయింది. ప్రస్తుతం Amazon Prime Video, Tubi, Shudder ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది ఈ హారర్ మూవీ.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మాక్స్, డ్రూ అని ఇద్దరు కుర్రాళ్లు ఉంటారు. వీళ్లకి వ్యూస్ అంటే పిచ్చి. అందుకే ఇంటర్నెట్‌లో “లైవ్ ఎక్సార్సిజం” అని ఒక షో మొదలుపెడతారు. అంటే ఎవరికైనా దెయ్యం పడితే దాన్ని వీళ్లు లైవ్‌లో వదిలిస్తారన్నమాట. కానీ అసలు విషయం ఏంటంటే, అదంతా ఉత్తుత్తిదే! అంతా స్క్రిప్ట్ రాసుకుని, మేకప్ వేయించి, జనాల్ని పిచ్చోళ్లని చేస్తూ తెగ డబ్బులు, లైకులు సంపాదిస్తుంటారు. ఒకరోజు లైవ్ షో జరుగుతుండగా, అనుకోకుండా డ్రూ గర్ల్‌ఫ్రెండ్ లేన్ మీదకి నిజమైన దెయ్యం వచ్చేస్తుంది. ముందు ఇది కూడా ఏదో ప్రాంక్ అనుకుంటారు కానీ, ఆ దెయ్యం చేసే పనులకి వీళ్లకి చమటలు పడతాయి.

అది మామూలు దెయ్యం కాదు, వీళ్ల గతాన్ని, వీళ్ల దొంగ పనులని లైవ్‌లో అందరి ముందు బయటపెట్టేస్తుంది. షో చూస్తున్న లక్షల మంది ముందు వీళ్ల పరువు తీస్తూ, నరకం చూపిస్తుంది. షో గడుస్తున్న కొద్దీ దెయ్యం ఆటకు వీళ్లు బలిపశువులైపోతారు. ఆ దెయ్యం కేవలం ఆ గదిలో ఉన్నవాళ్లనే కాదు, ప్రపంచం మొత్తాన్ని టార్గెట్ చేస్తుంది. వ్యూస్ కోసం పాకులాడిన వీళ్లకి, చివరికి ఆ వ్యూసే శాపంగా మారుతాయి. క్లైమాక్స్‌లో ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చి, ఆ దెయ్యం ప్రపంచం మొత్తానికి ఒక పెద్ద షాక్ ఇస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? వీళ్ళు ఆ దెయ్యం నుంచి బయటపడ్డారా ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  మిస్సింగ్ కేసుతో మొదలయ్యే మర్డర్ కేసు… 2 గంటల పాటు సీట్ ఎడ్జ్ లో ఉంచే కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×