// // Horror Thriller OTT: ప్రేమ కోసం బోలెడన్ని మర్డర్లు...రక్తపాతంతో -->
E-Paper
Advertisement

Horror Thriller OTT: ప్రేమ కోసం బోలెడన్ని మర్డర్లు…రక్తపాతంతో సాగే సైకో రాసలీల… ఒక్కో సీన్ అరాచకం…

Horror Thriller OTT: ప్రేమ కోసం  బోలెడన్ని  మర్డర్లు…రక్తపాతంతో సాగే సైకో రాసలీల… ఒక్కో సీన్ అరాచకం…
Advertisement

Horror Thriller OTT: రకరకాల జానర్లలో సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాయి ఆడియన్స్ ని. కొత్త కొత్త కంటెంట్తో మేకర్స్ కూడా బలమైన కథలతో ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక హారర్ థ్రిల్లర్, తక్కువ బడ్జెట్ తోనే ఎక్కువ భయాన్ని చూపించింది. ఒక సింగర్ తో ప్రేమలో పడే సైకో అమ్మాయి చుట్టూ ఈ కథ ఉంటుంది. ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈ మూవీలో. ఇక ఈ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ పక్కాగా వస్తాయి.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ ఇండిపెండెంట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘స్టాకర్ జేన్’ (Stalker Jane). దీనికి రోజర్ గ్లెన్ హిల్ దర్శకత్వం వహించారు. ఇందులో హాలో కిచ్ (జేన్ పాత్రలో), నిగెల్ క్విన్ (డెమెట్రీ పాత్రలో) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 1న విడుదల అయింది. సంవత్సరం తరువాత 2026 మార్చి 10 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లాట్‌ ఫామ్‌లలో అద్దెకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా నిడివి సుమారు 1 గంట 38 నిమిషాలతో క్రేజీగా ఉంటుంది. ఈ సినిమాను కేవలం ఒక్క భాగంతో ఆపకుండా, దీనికి ఒక సీక్వెల్, ప్రీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథలో మెయిన్ క్యారెక్టర్ జేన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఈమెకి డెమెట్రీ అనే ఒక అప్‌కమింగ్ రాక్ స్టార్ అంటే మామూలు ఇష్టం కాదు, అదో రకమైన పిచ్చి. అతను ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా వెనకాలే పడి తిరుగుతుంటుంది. అతను ఒక పెద్ద స్టార్ అయిపోవాలని, అందరూ అతని గురించే మాట్లాడుకోవాలని ఈమె తెగ ఆరాటపడిపోతుంటుంది. కానీ అది ప్రేమ కాదు, ఒక సైకో లెవల్ అబ్సెషన్. డెమెట్రీ ఎదుగుదలకి ఎవరు అడ్డు వచ్చినా, లేదా వాడికి ఎవరైనా హాని చేయాలని చూసినా జేన్ అస్సలు తట్టుకోలేదు. వాడి కోసం ఈమె ఏకంగా రౌడీలా మారిపోతుంది.

అడ్డు వచ్చిన వాళ్ళని చంపడానికి కూడా వెనకాడదు. ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే, తనకి నచ్చిన వాడి కోసం రక్తపాతం సృష్టించి, వాళ్ళని దారుణంగా అంతం చేస్తుంది. ఈ క్రమంలో సినిమా అంతా భయంకరమైన సీన్లతో, రక్తంతో నిండి పోతుంది కూడా. మొదట్లో తనకి ఎవరో సాయం చేస్తున్నారని డెమెట్రీ సంబరపడతాడు కానీ, మెల్లమెల్లగా జేన్ చేస్తున్న దారుణాలు వాడికి అర్థమవుతాయి. తన చుట్టూ జరుగుతున్నవన్నీ చూసి వాడు హడలిపోతాడు. ఒక సామాన్యమైన అమ్మాయిలా కనిపించే జేన్, తన కోసం ఇంతటి ఘోరాలు చేస్తోందని తెలిసి షాక్ అవుతాడు. ఆఖరికి ఆ సైకో నుంచి సింగర్ ఎలా తప్పించుకున్నాడనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : కెరీర్ కోసం పుట్టుకొచ్చే ప్రేమ… ట్రయాంగిల్ లవ్ లో క్రేజీ క్లైమాక్స్… ఈ తరం యూత్ స్టోరీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×