E-Paper
Advertisement

దైవం అనుకున్న శక్తి దెయ్యంలా మారితే… ఓటీటీలో బీభత్సం సృష్టిస్తున్న సిరీస్

దైవం అనుకున్న శక్తి దెయ్యంలా మారితే… ఓటీటీలో బీభత్సం సృష్టిస్తున్న సిరీస్
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలో ఒక సూపర్ నేచురల్ హారర్ సిరీస్ తెగ భయపెడుతోంది. చర్చికి ఒక కొత్త ఫాదర్ రావడంతో కథలో హారర్ డోస్ పెరుగుతుంది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత కెనడాలో షూటింగ్ జరుపుకున్న మొదటి పెద్ద ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఒక ద్వీపం చుట్టూ సాగే ఈ సిరిస్ ప్రతి ఎపిసోడ్ లో ఊహించని మలుపులు ఉంటాయి. అంతేకాదు మితిమీరిన మత విశ్వాసాలు, ఎలాంటి ప్రమాదాలు తెచ్చిపెడతాయో ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. హారర్ ఫ్యాన్స్ ఓ లుక్ వేయాల్సిన సిరీస్ ఇది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ వెబ్ సిరీస్ పేరు ‘మిడ్నైట్ మాస్’ (Midnight Mass). 2021లో వచ్చిన ఈ సిరీస్ ను ప్రముఖ దర్శకుడు మైక్ ఫ్లానగన్ రూపొందించారు. ఇతను హారర్ సినిమాల్లో మాస్టర్. ఈ కథను అతను దాదాపు 10 ఏళ్ల క్రితమే రాసుకున్నాడు. ఇది అతని పర్సనల్ ప్రాజెక్ట్. ఇందులో ఫాదర్ పాల్ పాత్రలో హమీష్ లింక్లేటర్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం 7 ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికీ ఇది బెస్ట్ హారర్ సిరీస్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సముద్రం మధ్యలో క్రాకెట్ ఐలాండ్ అనే ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊర్లో జనాలు తక్కువ, చేపలు పట్టుకుని బతికేవాళ్లే ఎక్కువ. ఒక యాక్సిడెంట్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన రైలీ అనే కుర్రాడు మళ్లీ తన సొంతూరికి వస్తాడు. అదే టైమ్‌లో ఆ ఊరి చర్చికి ముసలి ఫాదర్ ప్లేస్‌లో పాల్ అనే ఒక కొత్త కుర్ర ఫాదర్ వస్తాడు. అతను వచ్చినప్పటి నుండి ఆ ఊర్లో అన్నీ వింతలే జరుగుతుంటాయి. సరిగ్గా నడవలేని వాళ్లు నడవడం, ముసలివాళ్లు మళ్లీ యవ్వనంలోకి రావడం చూసి ఊర్లో జనం అంతా ఆ ఫాదర్‌ని దేవుడిలా నమ్మడం మొదలుపెడతారు.

కానీ అసలు కథ ఇక్కడే ఉంది. ఆ ఫాదర్ తెచ్చింది దేవుడి శక్తి కాదు, ఒక భయంకరమైన రాక్షసి రక్తాన్ని! ఆ రక్తాన్ని వైన్ పేరుతో చర్చికి వచ్చే భక్తులకు తాగిస్తుంటాడు. అది తాగిన వాళ్లకు రోగాలు పోతాయి, యవ్వనం వస్తుంది కానీ వాళ్లు మెల్లగా వెలుగుని చూస్తే తట్టుకోలేని స్థితికి చేరుకుంటారు. ఆ రాక్షసి రక్తం వల్ల ఊర్లో వాళ్లంతా మనుషులుగా మారిపోతున్నామా లేక రాక్షసుల్లా తయారవుతున్నామా అని తెలియని అయోమయంలో పడిపోతారు. ఆ ఊరు మొత్తం రక్తం ఏరులై పారుతుంది. చర్చిలో ఉన్న జనం ఒకరినొకరు కరుచుకుని రాక్షసుల్లా మారిపోతారు. రైలీ కొంతమందితో దీనిని ఆపేందుకు ప్రయత్నిస్తాడు. చివరికి ఈ వినాశనం ఆగుతుందా ? అందరూ పిశాచాలుగా మారిపోతారా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఒకే రోజు పుట్టిన ఇద్దరు పిల్లల వింత కథ… గుండెల్ని పిండేసే ఇద్దరు తల్లుల ఎమోషనల్ జర్నీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×