E-Paper
Advertisement

Horror Thriller Series OTT: అది ఊరు కాదు దెయ్యాల దిబ్బ… రాత్రయితే రక్తపాతమే… ఇదెక్కడి సిరీస్ మావా వణికిస్తోంది

Horror Thriller Series OTT: అది ఊరు కాదు దెయ్యాల దిబ్బ… రాత్రయితే రక్తపాతమే… ఇదెక్కడి సిరీస్ మావా వణికిస్తోంది
Advertisement

Horror Thriller Series OTT : ఓటీటీలో ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులకు వణుకు పుట్టిస్తోంది. ఈ సిరీస్ ఐయండిబిలో టాప్ రేటింగ్ తో కూడా సాగుతోంది. ఒక విచిత్రమైన ఊరిలో చిక్కుకునే కొంత మంది మనుషుల చుట్టూ స్టోరీ జరుగుతుంది. ఆ వింత ఊరిలో రాత్రి అయితే దయ్యాలు హల్చల్ చేస్తుంటాయి. ఒక్కసారి ఎంటర్ అయితే తప్పించుకోవడం అంత ఈజీ కాదు. చూస్తున్నంతసేపు చూపు తిప్పుకోవడం కష్టమే అలా ఉంటుంది ప్రతి ఎపిసోడ్. గూస్ బంప్స్ వచ్చే సస్పెన్స్, ఒళ్ళు గగుర్పొడిచే రక్తపాతం చూడాలనుకుంటే ఈ సిరీస్ ను మిస్ కావద్దు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్ పేరు ‘ఫ్రమ్’ (FROM). జాన్ గ్రిఫిన్ రూపొందించిన ఈ సిరీస్ 3 సీజన్లను పూర్తి చేసుకుంది. 4వ 2026 సీజన్ 19 ఏప్రిల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో హెరాల్డ్ పెర్రినో, కాటాలినా శాండినో మోరెనో, ఇయాన్ బెయిలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2022 ఫిబ్రవరి 20న Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ ఉత్కంఠభరితమైన కథనం, నటీనటుల నటనకు మంచి ప్రశంసలు అందుకుంది కూడా. ఐయండిబిలో దీనికి 7.8 టాప్ రేటింగ్ ఉండటం విశేషం.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ఊరిలో పొరపాటున కారు పోనిచ్చామా, ఇక అంతే సంగతులు. రోడ్డు మీద పడి ఎంత దూరం వెళ్లినా, ఆఖరికి మళ్ళీ అదే ఊరు సెంటర్లోకి వచ్చి ఆగుతాం. చుట్టూ అడవి, మధ్యలో ఒక పాడుబడ్డ ఊరు.. అసలు అక్కడి నుంచి బయటపడదామంటే ఒక్క దారి కూడా కనిపించదు. ఒక్కసారి లోపలికి వెళ్ళారా, బయటి ప్రపంచం అనేది ఒక కలలా మిగిలిపోతుంది. పగలైతే ఏదో గడిచిపోతుంది కానీ, సూర్యుడు అస్తమించి చీకటి పడిందంటే అసలు నరకం మొదలవుతుంది. అడవిలో నుంచి మనుషుల రూపంలో ఉండే దెయ్యాలు బయటకు వస్తాయి. అవి చూడటానికి మామూలు మనుషుల్లాగే నవ్వుతూ పలకరిస్తాయి కానీ, తలుపు తీశావో ఇక అంతే సంగతులు.

అందుకే చీకటి పడగానే ఇంట్లో దూరి తలుపు గడియ పెట్టుకుని, గుమ్మానికి ఒక మహిమ గల తాయెత్తుని తగిలించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చోవాలి. చిన్న పొరపాటు జరిగినా ఆ రాత్రి ఆఖరి రాత్రి అయిపోతుంది. అక్కడ చిక్కుకున్నోళ్లంతా ఆ భయంకరమైన జీవుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల తిప్పలు పడుతుంటారు. ఆ ఊరి షెరీఫ్ అందరినీ కాపాడటానికి గట్టిగానే ట్రై చేస్తాడు కానీ, ఆ ఊరి వెనుక ఉన్న మిస్టరీ మాత్రం అస్సలు అంతుచిక్కదు. చివరికి అక్కడ ఉన్న వాళ్ళు ప్రాణాలతో బయట పడతారా ? ఈ ఊరిలో రాత్రి పూటే ఎందుకు అలా జరుగుతోంది ? అనే విషయాలను ఈ హారర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న నానా పటేకర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×