E-Paper
Advertisement

Horror Thriller OTT : సినిమా అంటే ఇదే.. రప్ఫాడించే రణరంగం… దీని క్లైమాక్స్ కి నిద్రకూడా పట్టదు మావా

Horror Thriller OTT : సినిమా అంటే ఇదే.. రప్ఫాడించే రణరంగం… దీని క్లైమాక్స్ కి నిద్రకూడా పట్టదు మావా
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలోకి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు ప్రత్యేకమయిన గుర్తింపును తెచ్చుకుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాకి ఆ అర్హత ఉందనే చెప్పుకోవచ్చు. ఈ ఆఫ్రికన్ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఊహించని మలుపులు వస్తూనే ఉంటాయి ఇందులో. అంతేకాదు ఇది థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగుతూ, హఠాత్తుగా హారర్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ అతీంద్రీయ శక్తులు కూడా ఎంట్రీ ఇస్తాయి. ఇది 1 గంట 24 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది. అయితే సినిమా ఆడియన్స్ కి కావలసినంత మజా ఇస్తుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సలోమ్’ (Saloum). 2021లో వచ్చిన ఈ సినిమా, జీన్ లూక్ హెర్బులట్ దర్శకత్వం వహించారు. ఆయన ఆఫ్రికన్ జానపద కథలను, హారర్ ఎలిమెంట్స్‌తో కలిపి ఒక కొత్త రకమైన స్టైల్‌ను పరిచయం చేశారు. ఇది క్రైమ్ థ్రిల్లర్‌గా మొదలై, మెల్లగా హారర్ సినిమాగా మారుతుంది. ఇందులో యాన్ గేల్ (చకా), రోజర్ సల్లా (రాఫా), మెంటర్ బా (మిన్విట్) అనే ముగ్గురు నటులు ‘హైనాస్ ఆఫ్ బంగుయ్’ అనే కిరాయి సైనికుల గ్యాంగ్‌గా అద్భుతంగా నటించారు. ఇది 2021 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన చిత్రంగా దీనికి పేరుంది. ప్రస్తుతం ఈ సినిమా Tubi, Apple tvలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ చకా, రాఫా, మిన్విట్ అనే ముగ్గురు కిరాయి సైనికుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒక భయంకరమైన డ్రగ్ లార్డ్‌ను ఒక మిషన్ లో విడిపించి, భారీగా బంగారంతో విమానంలో పారిపోతుంటారు. అయితే మధ్యలో విమానం మొరాయించడంతో, సెనెగల్‌లోని సలోమ్ డెల్టా అనే నిర్మానుష్య ప్రాంతంలో దిగాల్సి వస్తుంది. అక్కడ ఒక రిసార్ట్‌లో మామూలు పర్యాటకుల్లా నటిస్తూ తలదాచుకుంటారు. అయితే ఆ గ్యాంగ్ లో లీడర్ లా ఉండే చకాకి, ఆ ప్రాంతంతో ఒక భయంకరమైన గతం ఉంటుంది. చిన్నప్పుడు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని వాడు ప్లాన్ చేస్తాడు. ఈ సమయంలో ఊహించని మలుపు వస్తుంది. థ్రిల్లర్ సినిమాలా సాగే ఈ స్టోరీ హారర్ మోడ్ కి వెళ్తుంది.

ఇప్పుడు ఆ ముగ్గురు కేవలం మనుషులతోనే కాదు, ఆ అడవిలో ఉన్న వింత అతీంద్రియ శక్తులతో కూడా తలపడాల్సి వస్తుంది. ఆ శక్తులు గాలిలో ఉంటూ మనుషుల ప్రాణాలు తీస్తుంటాయి. కథ చివరలో ఆ ప్రాంతం మొత్తం ఒక యుద్ధభూమిలా మారుతుంది. చుట్టూ అదృశ్య శక్తులు దాడి చేస్తుంటే, లేటెస్ట్ తుపాకులు కూడా పని చేయవు. చివరికి తన స్నేహితులను కాపాడుకోవడానికి, తన పగ తీర్చుకోవడానికి చకా ఏం చేశాడు? ఆ గాలిలో ఉండే రాక్షస శక్తుల రహస్యం ఏంటి? చివరికి ఆ ముగ్గురు దోస్తుల్లో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు? అనేదే ఈ యాక్షన్ థ్రిల్లర్ ముగింపు.

Advertisement

Read Also :  పగలు పల్లెటూరి పిల్ల… రాత్రి గాలిలో తేలే తల… విజువల్స్ తో వణుకు పుట్టించే సినిమా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×