E-Paper
Advertisement

ఆ ఊళ్లో అడుగు పెడితే ఇదే గతి… దమ్ముంటే రాత్రి పూట ఈ సినిమా చూడండి

ఆ ఊళ్లో అడుగు పెడితే ఇదే గతి… దమ్ముంటే రాత్రి పూట ఈ సినిమా చూడండి
Advertisement

Horror Thriller OTT : రక్తపిశాచుల కాన్సెప్ట్ అంటేనే క్రేజీగా ఉంటుంది. ఈ కంటెంట్ ను ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను బాగా భయపెట్టిన ఒక మూవీ గురించి చెప్పుకుందాం. 1970ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రం, ఒక ప్రశాంతమైన ఊరు క్రమక్రమంగా రక్తపిశాచుల స్థావరంగా ఎలా మారింది అనే అంశాన్ని భయంకరమైన విజువల్స్ తో చూపిస్తుంది. ‘ది కంజురింగ్’ వంటి సినిమాలను నిర్మించిన జేమ్స్ వాన్ దీనికి నిర్మాత కావడంతో, పాతకాలపు హారర్ స్టైల్‌లో భయపెట్టే సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఎక్కడ చూడచ్చు అంటే

2024 లో వచ్చిన ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు Salem’s Lot. హారర్ సినిమాల స్పెషలిస్ట్ జేమ్స్ వాన్ దీనికి నిర్మాతగా వ్యవహరించగా, ‘ఇట్’ సినిమా రచయిత గ్యారీ డౌబెర్‌మాన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇది సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా Max ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో విడుదల అయింది. రచయిత స్టీఫెన్ కింగ్ స్వయంగా ఈ సినిమాను చూసి, ఇది చాలా పాతకాలపు హారర్ స్టైల్‌లో బాగుందని మెచ్చుకోవడం విశేషం. రక్తపిశాచుల మేకప్ కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఉపయోగించడం వల్ల అవి చాలా భయంకరంగా కనిపిస్తాయి. ఇది 2024 అక్టోబర్ 3న నేరుగా HBO Max లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాను Amazon Prime Video, Google Play Moviesలో రెంట్ కు తీసుకోవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బెన్ మీర్స్ అనే ఒక రైటర్ చిన్నప్పుడు తను పుట్టి పెరిగిన ఊరుకి తిరిగి వస్తాడు. అయితే అతను వచ్చిన టైమ్‌కే ఆ ఊళ్లో వింత వింత పనులు జరుగుతుంటాయి. ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ బిల్డింగ్ లో రిచర్డ్ స్ట్రైకర్ అనే వ్యక్తి తన బాస్ బార్లో చెప్పాడని ఒక పెద్ద పెట్టెను అక్కడ దించుతాడు. ఆ పెట్టెలో ఉన్నది ఎవరో కాదు, ఒక భయంకరమైన పాతకాలపు రక్తపిశాచి. ఆ తరువాత మెల్లగా ఆ ఊళ్లో ఉండే పిల్లలు, పెద్దలు ఒక్కొక్కరుగా మాయమైపోతుంటారు. మాయమైనోళ్లంతా మళ్ళీ చీకటి పడ్డాక కళ్లు ఎర్రజేసుకుని, కోర పళ్లతో రక్తపిశాచుల్లా ఊరి మీద పడతారు. కరిచినోడిని కరిచినట్టు అందరినీ తమ బ్యాచ్‌లోనే కలిపేసుకుంటారు.

ఆఖరికి ఆ ఊరంతా దెయ్యాల కొంపలా మారిపోతుంది. ఊర్లో ఏ ఇంట్లో చూసినా ఇదే గోల. ఇదంతా కళ్ళారా చూసిన బెన్ మీర్స్, అతనికి తోడుగా ఒక డాక్టరు, ఒక కుర్రాడు, ఒక టీచరు కలిసి ఆ రక్తపిశాచుల మీద యుద్ధానికి దిగుతారు. వీళ్లందరినీ ఎలాగైనా చంపేయాలని ఆ మెయిన్ విలన్ బార్లో ప్లాన్ చేస్తాడు. కానీ హీరో బెన్ టీమ్ ఏమాత్రం భయపడకుండా దెయ్యాల వేట మొదలుపెడతారు. చివరికి వీళ్ళంతా రక్తపిశాచులను అదుపు చేస్తారా ? బార్లో ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : రిలేషన్షిప్ మర్డర్ తో దిమ్మతిరిగే లీగల్ క్రైమ్ స్టోరీ… క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు బాస్

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×