// // Horror Thriller OTT : మాట్లాడే జోంబీలు... ఒళ్ళు జలదరించే బ్లడ్ -->
E-Paper
Advertisement

Horror Thriller OTT : మాట్లాడే జోంబీలు… ఒళ్ళు జలదరించే బ్లడ్ బాత్… సీను సీనుకి ఉత్కంఠ

Horror Thriller OTT : మాట్లాడే జోంబీలు… ఒళ్ళు జలదరించే బ్లడ్ బాత్… సీను సీనుకి ఉత్కంఠ
Advertisement

Horror Thriller OTT : జోంబీ సినిమాలలో రక్తం ఏరులై పారడం సాధారణమే. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో, జోంబీ కన్నా ప్రమాదకరంగా మారే ఒక ఇంటి యజమాని చుట్టూ కథ ఉంటుంది. ఈ చిత్రం జోంబీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా చెప్పుకోవచ్చు. ఇక ఇందులో జోంబీలు మాట్లాడటం ఒక స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఫిలిప్పీన్ సైకలాజికల్ హారర్ సినిమా పేరు ‘ఔట్‌సైడ్’ (Outside). కార్లో లెడెస్మా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిడ్ లూసెరో, బ్యూటీ గొంజాలెజ్, మార్కో మాసా, ఐడెన్ టైలర్ పాటూ ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు 2 గంటల 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, 2024 అక్టోబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

భూమి మీద ఏదో వైరస్ వచ్చి జనాలందరూ పిచ్చోళ్లలాగా మారిఒక, ఒకరినొకరు కరుచుకుంటూ జోంబీలు అయిపోతుంటారు. అప్పుడు హీరో ఫ్రాన్సిస్, తన పెళ్లాం పిల్లల్ని తీసుకుని, సేఫ్‌గా ఉంటామని చెప్పి ఊరి బయట ఉన్న ఫామ్ హౌస్‌కి తీసుకెళ్తాడు. ఇక్కడ మనం పక్కా సేఫ్ అని ఫ్యామిలీకి భరోసా ఇస్తాడు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. బయట తిరిగే జోంబీల కంటే, ఇంట్లోనే ఉన్న హీరో ప్రవర్తన వింతగా మారుతుంది. చిన్నప్పుడు వాళ్ల నాన్న బాధపెట్టిన జ్ఞాపకాలు, పెళ్లాం మీద అనుమానం అన్నీ కలిపి వాడికి పిచ్చెక్కిస్తుంది. కష్టాల్లో ఉన్న ఫ్యామిలీని కాపాడాల్సింది పోయి, వాళ్ల మీదనే పెత్తనం చలాయిస్తూ, బయట ప్రపంచం నుంచి వాళ్లని పూర్తిగా వేరు చేసి ఇంట్లోనే బంధిస్తాడు.

అంటే బయట ఉన్న జోంబీల కంటే ఇంట్లో ఉన్న హీరోనే పెద్ద దయ్యంలా తయారవుతాడు. చివరికి ఏమవుతుందంటే.. హీరోకి మెల్లగా మతి భ్రమించి, తన ఫ్యామిలీని కంట్రోల్ చేసే క్రమంలో దారుణాలకు ఒడిగడతాడు. జోంబీల బారి నుంచి తప్పించుకోవడం పక్కన పెడితే, సొంత తండ్రి నుంచే ఆ భార్యాపిల్లలు ఎలా ప్రాణాలు దక్కించుకుని బయటపడ్డారు అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : స్విమ్మింగ్ పూల్ కోచ్ తో ప్రేమ… చూపు తిప్పుకోని అందాలు… అదిరిపోయే ట్రయాంగిల్ లవ్వు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×