// // Horror thriller OTT : ఈ దెయ్యం దెబ్బకి ఒక్కొక్కరు మటాష్ ... -->
E-Paper
Advertisement

Horror thriller OTT : ఈ దెయ్యం దెబ్బకి ఒక్కొక్కరు మటాష్… ఈ మలయాళం మూవీలో ఎన్ని మలుపులో

Horror thriller OTT : ఈ దెయ్యం దెబ్బకి ఒక్కొక్కరు మటాష్… ఈ మలయాళం మూవీలో ఎన్ని మలుపులో
Advertisement

Horror thriller OTT : అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే సినిమాలను చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇలాంటి సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమాలో హారర్ సీన్స్ స్కేరీగా ఉన్నాయి. మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఆసక్తికర కథనంతో నడుస్తుంది. ఇక ఆత్మలు చేసే అరాచకం కూడా ఎక్కువే ఉంటుంది. హారర్ ఫ్యాన్స్ ఓ లుక్ వేయాల్సిన మూవీ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నీలి’ (Neeli). ఇది అల్తాఫ్ రెహమాన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో అనూప్ మీనన్, మమతా మోహన్‌దాస్, బేబీ మ్య లీడ్ రోల్స్ లో నటించారు. సన్ యాడ్స్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టి.ఎ.సుందర్ మీనన్ దీనిని నిర్మించారు. 2018లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం Zee5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  తెల్లారితే పెళ్లి… నైట్ కి నైట్ వధూవరులు జంప్… కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ

కథలోకి వెళ్తే

లక్ష్మి (మమతా మోహన్‌దాస్) అనే మహిళ తన భర్త చనిపోవడంతో, ఆమె తన ఆరేళ్ల కుమార్తె తారాతో కలిసి తన సొంత గ్రామమైన ‘కల్లియంకాడు’కి తిరిగి వస్తుంది. లక్ష్మి తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల ఆమెకు గ్రామంలో పెద్దగా మద్దతు ఉండదు. ఆ గ్రామంలో జరిగే ఉత్సవాల సమయంలో ఒక రాత్రి లక్ష్మిపై దాడి జరుగుతుంది. ఆమె కళ్లముందే తన కూతురు తారా కిడ్నాప్ అవుతుంది. ఆ తరువాత లక్ష్మి పోలీసుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోతుంది.

Advertisement

తన బిడ్డను వెతకడానికి లక్ష్మి నలుగురు అపరిచితుల సహాయం తీసుకుంటుంది. వీరిలో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, ఇద్దరు దొంగలు , ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఆ గ్రామంలో ‘కల్లియంకట్టు నీలి’ అనే ఒక అతీంద్రియ శక్తి (యక్షి) ఉందనే నమ్మకం ఉంటుంది. లక్ష్మి తన బిడ్డ జాడ కోసం చివరకు ఆ నీలి సహాయాన్ని కోరుతుంది. ఇక లక్ష్మి భర్త కూడా దెయ్యం రూపంలో ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు. దీంతో స్టోరీ మరింత ఉత్కంఠంగా సాగుతుంది. ఇంతకీ లక్ష్మి భర్త ఎందుకు ఆమెను వెంటాడుతున్నాడు ? చివరకు లక్ష్మి తన కుమార్తెను ఎలా దక్కించుకుంది ? ఆ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటనేది క్లైమాక్స్‌లో తెలుస్తుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×