E-Paper
Advertisement

వికటించిన క్షుద్ర పూజలు… థియేటర్లను వణికించిన తమిళ హారర్ ఓటీటీలోనూ ట్రెండింగ్

వికటించిన క్షుద్ర పూజలు… థియేటర్లను వణికించిన తమిళ హారర్ ఓటీటీలోనూ ట్రెండింగ్
Advertisement

Horror Thriller movie on OTT : దెయ్యాలు, క్షుద్రపూజల కంటెంట్ ను ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. ఓటీటీలో అయితే సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లను కూడా అస్సలు వదలటం లేదు. భయపెడుతూ ఎంటర్టైన్ చేసే ఈ స్టోరీలను ప్రతి భాషలో చూస్తున్నారు. ఎందుకంటే వీటిని ఆనందించడానికి భాష పెద్దగా అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తమిళ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని బాగానే భయపెడుతోంది. గతనెల థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సినిమా. క్షుద్రపూజలు వికటిస్తే జరిగే భయంకరమైన పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భయంకరమైన డార్క్ విజువల్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2026 మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ తమిళ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం “సతన్: ది డార్క్” (Satan: The Dark). థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ హారర్ థ్రిల్లర్ మే 8 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు అడియోతో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత ఎడ్వర్డ్ రాజన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘EPS పిక్చర్స్’ బ్యానర్‌పై పరిమిత బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి మణికందన్ రామలింగం దర్శకత్వం వహించగా, బాలా జి. రామసామి అందించిన డార్క్ థీమ్ సినిమాటోగ్రఫీ, అశ్విన్ కృష్ణ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇందులో ఎఫ్‌జే, అయ్రా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజా రవి లీడ్ రోల్స్ లో నటించారు. అయితే ఈ సినిమాలో చూపించిన భయంకరమైన హారర్ ఎలిమెంట్స్, క్షుద్రపూజల సీన్ల కారణంగా సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్‌ను ఇచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ ఈస్టిండియా కంపెనీ కాలంలో మొదలవుతుంది. హస్తినాపురం అనే కొండ గ్రామంలో కొందరు క్షుద్రపూజలు, చేతబడి చేస్తుండగా ఒక పెద్ద తప్పు జరిగి, అది బెడిసికొడుతుంది. ఆ పర్యవసానంగా ఒక భయంకరమైన దుష్టశక్తి మేల్కొని, ఆ ఊరిపై ఒక శాపంగా మారుతుంది. ఆ కాలంలో మొదలైన ఈ వింత శాపం, తరాల పాటు సాగుతూ ప్రస్తుత కాలంలోని ఒక కుటుంబానికి చుట్టుకుంటుంది. మార్సెలిన్ అనే మహిళ ఆ సైతాన్ ప్రభావానికి గురై, క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టడంతో ఆమె కుటుంబం తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుంది. ఆ దుష్టశక్తి వల్ల మార్సెలిన్ కూతురైన అలీషా ప్రాణాలకు పెద్ద ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు అలీషాను ప్రాణంగా ఇష్టపడే ఆమె క్లాస్‌మేట్ సాగర్, ఈ ఘోరాల వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. తరాల నాటి ఆ శాపాన్ని, ఆ భయంకరమైన సైతాన్‌ను వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? ఆ క్షుద్రపూజల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించి అలీషా ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు? అనేదే ఈ సినిమా పూర్తి కథ.

Read Also : తల్లి మిస్సింగ్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు… డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×